సిద్ధు జొన్నలగడ్డ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన సిద్ధు.. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. స్టార్ హీరోస్ సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా కనిపించిన సిద్ధూ.. ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నాడు. అతడు మొదట్లో నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ డిజే టిల్లు సినిమా అతడి కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సిద్ధు పేరు మారుమోగింది. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
వరుసగా హిట్లతో దూసుకుపోతున్న సమయంలోనే జాక్ సినిమా ఊహించని రిజల్డ్ ఇచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడంతో సిద్ధు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది. దానిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధూ తన కెరీర్, సినిమా అవకాశాలు, డిజాస్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే తన గురించి వచ్చిన రూమర్స్ పై సైతం క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ప్రస్తుతం సిద్ధు నటించిన తెలుసు కదా సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు మాట్లాడుతూ.. “జాక్ సినిమా నిజంగానే ఆడలేదు. ఆ విషయంలో నాకు బాధ వేసింది. అందుకే రూ.4.75 కోట్లు అప్పు చేసి మరీ తిరిగి ఇచ్చేశాను. అప్పుడు నా చేతిలో డబ్బులు లేవు. అందుకే అప్పు చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతో కొందరు నష్టపోయారు. అది నాకు నచ్చలేదు. అందుకే అలా డబ్బులు ఇచ్చేశాను. డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు. ఇప్పుడు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..