మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు బదిలీ అయ్యే అవకాశం, వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లి వచ్చే అవకాశాలు కలుగుతాయి. నిరుద్యోగులు విదేశీ సంస్థల్లో ప్రయత్నాలు సాగించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ నెలాఖరు లోగా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ ఉద్యోగులకు ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా ఈ రాశివారు తప్పకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. హనీమూన్, విహార యాత్రలు, పర్యాటకం రీత్యా కూడా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించడానికి ఈ నెలాఖరు వరకూ సమయం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి స్థిరత్వం లభిస్తుంది. వీసా, స్థిరత్వ సంబంధమైన సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి.
కర్కాటకం: ఈ రాశికి తొమ్మిదవ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధించగలుగుతారు. ఈ రాశివారికి విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. పర్యాటకంతో పాటు విదేశాల్లో సత్కారాలు, సన్మానాలకు కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో కొద్ది రోజుల్లో మంచి ఆఫర్ అందుకుంటారు. ఉద్యోగులు కూడా విదేశీ పర్యటనలు చేసి, ఆదాయం గడించే అవకాశం ఉంది.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. వీరికి విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. వీసా సమస్యలు, స్థిరత్వ సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవడానికి, ఉన్నత విద్యలకు, శిక్షణ పొందడానికి విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల తప్పకుండా విదేశీయాన యోగం పడుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఊహించని ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో నైపుణ్యాలు పెంచుకోవడానికి, ఆధునిక శిక్షణకు అవకాశం ఉంది. విదేశీ సంపాదన సూచనలున్నాయి.
మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టినందువల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించడం, విదేశీ సంపాదనను అనుభవించడం, విదేశాల్లో స్థిరపడడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగపరంగా విదేశాల్లో ఉన్న బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగులు కూడా విదేశీ ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యలకు, నైపుణ్యాల మెరుగుదలకు, ఉత్తమ స్థాయి శిక్షణకు బాగా అవకాశం ఉంది.





