టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల క్రితం చక్రం తిప్పిన హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడిగా శ్రుతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. దీంతో తెలుగు, తమిళంలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. అంతేకాదు సినిమాలు సైతం తగ్గించేసింది. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున కలిసి నటించిన కూలీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది.
ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే..టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రుతిహాసన్ కజిన్ ఉన్నారని మీకు తెలుసా.. ? ఆమె సైతం ఒకప్పుడు తోపు హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..
శ్రుతిహాసన్ కజిన్ మరెవరో కాదండి.. సీనియర్ హీరోయిన్ సుహాసిని. కమల్ హాసన్ ఆమెకు బాబాయ్ అవుతాడు. అంటే సుహాసినికి శ్రుతి హాసన్ చెల్లెలు అవుతుంది. ఒకప్పుడు తెలుగులో వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించింది.