Shilajit: శిలాజిత్‌ను వాడుతున్నారా?.. ఈ మూడు తప్పులను అస్సలూ చేయకండి!

Shilajit: శిలాజిత్‌ను వాడుతున్నారా?.. ఈ మూడు తప్పులను అస్సలూ చేయకండి!


Shilajit: శిలాజిత్‌ను వాడుతున్నారా?.. ఈ మూడు తప్పులను అస్సలూ చేయకండి!

ఆయుర్వేదంలో, శిలాజిత్‌ను “రసాయన” అని పిలుస్తారు, అంటే శరీరానికి శక్తివంతమైన టానిక్ అని అర్థం. ఇందులో ఫుల్విక్ ఆమ్లం, 80కి పైగా ఖనిజాలు ఉంటాయి, ఇవి మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. అలాగే ఇది అలసటను తగ్గిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో పాటు మీ ఎముకలు, కీళ్లను బలపరుస్తుంది. దీన్ని వాడడం వల్ల త్వరగా వృద్యాప్యం కూడా రాదు. అయితే, చాలా మంది దీనిని కొన్ని రోజులు వాడి ప్రయోజనం లేదని మానేస్తున్నారు. కానీ శిలాజిత్ తీసుకునేటప్పుడు ప్రజలు చేసే కొన్ని సాధారణ తప్పుల వల్ల వారు దాని ప్రయోజనాలను పొందట్లేదనే విషయం వారికి తెలియదు. కాబట్టి శిలాజిత్‌ను తీసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఒకసారి చూద్దాం

శిలాజిత్‌ తీసుకునేప్పుడు చేయకూడని తప్పులు

సరైన క్వాంటిటీలో తీసుకోకపోవడం : చాలా మంది త్వరగా బలం రావాలని శిలాజిత్‌ను ఎక్కువ మోతాదులు తీసుకుంటారు. కొన్నిసార్లు వాటిని తీసుకోవడం కూడా మర్చిపోతారు. ఇలా దీన్ని కరెక్ట్‌ డైట్‌లో తీసుకోకపోవడం వల్ల దాని ప్రయోజనాన్ని పొందలేరు. ఇలా దాన్ని తప్పుగా వినియోగించడం వల్ల డబ్బు, సమయం రెండే వేస్ట్‌ అవుతాయి. కాబట్టి దీన్ని సరైన క్వాంటిటీలో రోజుకు 300 నుండి 500 mg తీసుకుంటే సరిపోతుంది. అది కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే మీరు దాని ప్రయోజనాలను పొందుతారు.

తప్పుడు పదార్థాలతో తీసుకోవడం: కొంతమంది షిలాజిత్‌ను టీ, కాఫీ లేదా ఆల్కహాల్‌తో కలిపి తీసుకుంటారు. ఇలాంటి పదార్థాలు శిలాజిత్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల మీరు దాని ప్రయోజనాలను పొందలేరు. కాబట్టి దాని లక్షణాలను పెంచడానికి మీరు శిలాజిత్‌ను పాలు, గోరువెచ్చని నీరు లేదా తేనెతో తీసుకోవాలి.

ఓపిక లేకపోవడం : శిలాజిత్ అనే తక్షణమే ప్రయోజనాలను అందించేది కాదు. దీనికి కనీసం 6 నుండి 8 వారాల పాటు క్రమం తప్పకుండా వాడితే అప్పడు మీలో రిజల్ట్‌ కనిపిస్తాయి. కొన్నిసార్లు, మెదడు, రోగనిరోధక శక్తి లేదా వృద్ధాప్య వ్యతిరేక ప్రభావాలను చూడటానికి 3 నుండి 4 నెలలు సమయం కూడా పట్టవచ్చు. కాబట్టి మీరు దీని ప్రయోజనాలను పొందాలంటే ఓర్పుతో వేచిచూడాల్సి ఉంటుంది. కాబట్టి, శిలాజిత్ పూర్తి ప్రయోజనాలను పొందడానికి, సరైన మోతాదు, సరైన పద్ధతి, ఓపిక అనేది చాలా అవసరం. మరో విషయం ఏమిటంటే మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల శిలాజిత్‌లు అందుబాలో ఉన్నాయి. కాబట్టి మీరు కొనుగోలు చేసేప్పుడు అది స్వచ్చమైందా, లేదా అనేది కచ్చితంగా తెలుసుకోండి.

NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *