
ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని పాలించిన శంకర్ ప్రస్తుతం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్తో ఆయన ఇమేజ్ దెబ్బతింది. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కనీస వసూళ్లను కూడా సాధించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో శంకర్ తదుపరి సినిమా ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయి. శంకర్ గతంలో ప్రకటించిన వేల్పరి నవల ఆధారిత సినిమా పట్టాలెక్కించడం కష్టంగా మారింది. నిర్మాణ సంస్థలు భారతీయుడు 3 పనులు పూర్తి చేస్తే తప్ప మరో ప్రాజెక్టు ప్రారంభించడానికి అంగీకరించడం లేదు. బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాతల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శంకర్ భారతీయుడు 3 నిర్మాతలకు మూడు నెలల గడువు విధించారు. ఈ డెడ్లైన్ లోగా నిర్ణయం తీసుకోకపోతే తాను మరో ప్రాజెక్టును మొదలుపెడతానని తెలిపారు. అయితే, ఈ పరిస్థితుల్లో శంకర్ అంత ధైర్యం చేయగలరా, వందల కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత దొరుకుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ గందరగోళం ఎప్పుడు వీడుతుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika: బ్యాక్ టు షూట్.. షాకిస్తున్న విరోష్ జంట
గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?
ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్
Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది
ట్రంప్.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల