తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. అయినప్పటికీ శనీశ్వర కదలిక ప్రభావం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. తరువాత మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా మొత్తం 12 రాశులలో శనీశ్వరుడు ఒక భ్రమణం పూర్తి చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనీశ్వరుడు బృహస్పతి అధిపతి అయిన మీనరాశిలో ఉన్నాడు. అంతేకాదు తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. శనీశ్వరుడు జూన్ 2027 వరకు ఈ రాశిలో ఉంటాడు..ఆ తర్వాత శనీశ్వరుడు అంగారకుడి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.
శనీశ్వరుడు ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండటం వల్ల.. అప్పుడప్పుడు ఏదో ఒక గ్రహంతో సంయోగం ఏర్పరుస్తుంది. ఈ గ్రహాల కలయిక శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తుంది. అక్టోబర్ నెలలో శనీశ్వరుడు, శుక్రుడు ఒకరి ముందు ఒకరుకి అంటే ముఖాముఖి రానున్నారు. దీంతో ఈ గ్రహాలు ప్రతియుతి యోగాన్ని సృష్టించనున్నాయి. అంటే రెండు గ్రహాలు ముఖాముఖి రానున్న కారణంగా, కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్టోబర్ 11 సాయంత్రం శనీశ్వరుడు, శుక్రుడు ఒకరినొకరు ఎదురెదురుగా రానున్నాయి. ఈ ప్రతియుతి యోగం ఏ రాశులకు ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి అక్టోబర్ 11న ఏర్పడే శని-శుక్ర ప్రతియుత యోగం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో శనీశ్వరుడు వీరిపై ప్రత్యేక ఆశీస్సులు కురిపిస్తాడు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నవారు మెరుగుదల చూస్తారు. జీవితంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. జీవితంలో ప్రతికూల ప్రభావాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ జీవితంలో కొత్తగా ఏదైనా చేయగలరు. ఈ యోగం ఏర్పడటం వల్ల భవిష్యత్తులో సంపదను కూడబెట్టుకుంటారు. ఏ పని మొదలు పెట్టినా విజయం లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యా రంగంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో విద్యా రంగంతో సంబంధం ఉన్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి.
వృషభ రాశి: ఈ రాశి వారికి శుక్రుడు, శనీశ్వరుడు సంయోగం వల్ల ఏర్పడిన ప్రతియుతి యోగం చాలా శుభప్రదంగా .. ప్రయోజనకరంగా ఉంటుంది. శనీశ్వరుడు శుక్రుడు ఇద్దరూ ఒకరుకొకరు ఎదురుగా ఉండటంతో శని దృష్టి తన స్నేహితుడు శుక్రుడిపై పడుతోంది. దీనివల్ల వృషభ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు గణనీయమైన కెరీర్ లాభాలు, సంపద వృద్ధిని పొందుతారు. ఉపాధి కోరుకునే వారు గణనీయమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు కృషికి ప్రతిఫలాలను పొందుతారు.
మీన రాశి: మీన రాశి వారు శని-శుక్ర సంయోగం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. శుక్ర-శని సంయోగం చాలా అనుకూలమైన ప్రతియుతి యోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఇది ఈ రాశికి చెందిన వ్యక్తుల సమస్యలకు ముగింపు పలుకుతుంది. వీరు జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లను సాధించే అవకాశం కూడా కలుగవచ్చు.