ఈ సంవత్సరం దీపావళి పండగను అక్టోబర్ 20, 2025న జరుపుకోనున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజున ఒక ప్రత్యేక గ్రహాల కలయిక జరగనుంది. ఇది చాలా శుభప్రదమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ద్రుక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం.. దీపావళి రోజున శనీశ్వర, బుధ గ్రహాల కలయిక ఏర్పడనుంది. ఈ సంయోగం నవపంచ రాజ్యయోగాన్ని సృష్టిస్తుంది. ఈ అరుదైన సంయోగం అనేక రాశులకు శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. కొంతమందికి ఈ సమయం ఆర్థిక లాభం, విజయం, కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ రోజు ఈ శుభ సంయోగం వల్ల ఏ రాశులు ప్రభావితమవుతాయి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం..
మకర రాశి: శనీశ్వర, బుధుల కలయిక మకర రాశి వారికి చాలా శుభప్రదం. ఈ కలయిక మకర రాశి వారికి పురోగతి, సాధనకు కొత్త మార్గాలను తెరుస్తుందని నమ్ముతారు. అంతేకాదు వీరు పనిలో కొత్త బాధ్యతలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. వివాహిత జంటలు తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకుంటారు. వైవాహిక జీవితం మధురంగా మారుతుంది. ఈ సమయంలో వ్యాపారస్థులు అకస్మాత్తుగా గణనీయమైన లాభాలను పొందుతారని.. దీర్ఘకాలిక నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రాజయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ యోగ సమయంలో నిలిచిపోయిన నిధులను తిరిగి పొందే అవకాశం ఉంది. ఆర్థిక శ్రేయస్సు బలపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. కుటుంబంలో సుఖాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఇవి కూడా చదవండి
వృషభ రాశి: ఈ సంవత్సరం దీపావళి పండుగ వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కోరుకున్న ప్రాజెక్టులు, కొత్త ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. గణనీయమైన వ్యాపార లాభాలు సాధ్యమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది . కుటుంబం సభ్యుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. అంతేకాదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు