Shakthi: ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? భారీ డిజాస్టర్ భలే తప్పించుకున్నాడు

Shakthi: ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? భారీ డిజాస్టర్ భలే తప్పించుకున్నాడు


గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన సినిమా కెరీర్ లో మర్చిపోలేని చిత్రం శక్తి. 2011లో రిలీజైన ఈ సినిమా ఎన్టీఆర్ కు చేదు ఫలితాన్ని అందించింది. రిలీజ్ కు ముందు ఈ మూవీపై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. దీనికి తోడు పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ శక్తి సినిమాపై అంచనాలను ఆకాశన్నంటేలా చేశాయి. కానీ తీరా థియేటర్లలోకి వచ్చాక ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. భారీ బడ్జెట్‌తో, శక్తి పీఠాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తారక్ కెరీర్‌లోనే ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక నిర్మాత అశ్విని దత్‌కి కూడా ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. శక్తి సినిమా దెబ్బకు అశ్విని దత్ ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో అద్భుతంగా నటించాడు. కానీ సినిమాలో అసలు కథ పక్కదారి పట్టడంతో ఎన్టీఆర్ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడు శక్తి సినిమాను గుర్తు చేసుకుంటుంటాడు. ఆర్‌ఆర్ ఆర్ ప్రమోషన్లలో సందర్భంగా మీరందరూ మర్చిపోయినా నేను ఈ సినిమాను మర్చిపోలేను అంటూ శక్తి మూవీని ప్రస్తావించాడు.

అయితే శక్తి సినిమాకు హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. దర్శకుడు మెహర్ రమేష్ ‘కంత్రి’ సినిమా తర్వాత ప్రభాస్‌కు రెండు కథలు వినిపించారట. అందులో ఒకటి ‘బిల్లా’ కాగా మరొకటి ‘శక్తి’. అయితే ‘శక్తి’ కథ ప్రభాస్‌కు పెద్దగా నచ్చలేదట. అందులోని ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రభాస్ కు పెద్దగా నచ్చకపోవడంతో బిల్లాకు ఓటేశాడట. డార్లింగ్ అనుకున్నట్లే బిల్లా సూపర్ హిట్ అయ్యింది. అందులో
ప్రభాస్‌ను మెహర్ రమేష్ చూపించిన స్టైలిష్ విధానం అందరికీ నచ్చింది. అదే సమయంలో మెహర్ రమేష్‌ తన దగ్గరున్న మరో కథ జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పారట. శక్తి పీఠాలు వంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండడంతో తారక్ ఈ సినిమాకు ఓకే చెప్పాడు. కానీ థియేటర్లలో రిలీజయ్యాక శక్తి సినిమా అన్ని రకాలుగానూ ఆడియెన్స్ ను నిరాశపర్చింది. అలా మొత్తానికి శక్తి సినిమా రూపంలో భారీ డిజాస్టర్ నుంచి ప్రభాస్ తప్పించుకున్నాడన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *