
School Holidays: పాఠశాలలకు హాలిడేస్ వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. అలాంటిది ఈ మార్చి నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. అందులో పండగల, ఆదివారాలు, రెండో శనివారాలు ఇలా ఇతర కార్యక్రమాల నేపథ్యంలో వరుస సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మార్చి నెలలో వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి.
ఈ 11 రోజుల సెలవుల్లో అటు పండుగలు, ఇటు వారాంతపు సెలవులు కలిసి చాలా ఉన్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ఉన్న విషయం తెలిసిందే. అయితే మార్చి 19న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. దీంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు మార్చి 20వ తేదీన రంజాన్ పండగా ఆ రోజు కూడా సెలవే. అలాగే మార్చి 21న శనివారం వస్తుంది. ఈ ఒక్క రోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతాయి. మరి కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది. లేదా ఆఫ్‌డే ఉంటుంది. ఇక మార్చి 27న శ్రీరామ నవమి, మార్చి 31న మహావీర్ జయంతి (ఆప్షన్ హాలీడే) వంటి పండుగల్లో పాఠశాలలకు సెలవులు ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Gold, Silver Price: భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీగా తగ్గింపు!
ఇక మార్చి 14న రెండో శనివారం కారణంగా పాఠశాలలకు సెలవు ఉండనుంది. మరుసటి రోజు ఆదివారం. ఇదిలా ఉండగా, ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ఈ నెల 16వ తేదీ నుంఇ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మార్చి 10 -25 తేదీల మధ్య పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఏదీఏమైనా మార్చి నెలలో ఉగాది, రంజాన్‌తో పాటు శని, ఆదివారం కలిసి వస్తుండటంతో వరుసగా సెలవులు ఉండనున్నాయి.
Government Scheme: మీరు పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసే స్కీమ్ గురించి మీకు తెలుసా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి