School Holidays: జూలైలో శ్రావణ మాసం రావడంతో దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు దుర్గా పూజ మండపాలను అందంగా అలంకరించారు. పిల్లలు రామ్లీలా ప్రదర్శనలు, జాతరలో స్వారీలు, వివిధ రుచికరమైన వంటకాలతో సహా వేడుకలను ఆస్వాదిస్తున్నారు. రావణుడి దిష్టిబొమ్మ దహనంతో సహా దసరాకు సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల మధ్య వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు మూసి ఉండనున్నాయి. పాఠశాల సెలవులు పిల్లలకు ఆనందాన్ని రెట్టింపు చేశాయి.
ఇది కూడా చదవండి: Gold Price: రూ.1.20 లక్షలకు చేరువలో తులం బంగారం ధర.. హైదరాబాద్‌లో గోల్డ్ ధర ఎంతో తెలుసా?
ఈ పండగల సీజన్‌లో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్‌లోని అనేక జిల్లాల్లో నవరాత్రి, దసరా కోసం పాఠశాలలకు సెలవులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంతలో సోనమ్ వాంగ్‌చుక్ సంఘటన తర్వాత నెలకొన్న ఉద్రిక్తత కారణంగా లేహ్‌లోని పాఠశాలలు మూసి ఉండనున్నాయి. నవరాత్రి, దసరా కోసం ఏ రాష్ట్రాలు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నాయి? ఎప్పుడు ప్రారంభం కానున్నాయో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్‌లో ఒకదాని ధర ఎంతో తెలుసా? BMW కార్లనే కొనొచ్చు!
- పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ దుర్గా పూజ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. దుర్గాదేవిని స్వాగతించడానికి రాష్ట్రంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. మండపాలను ఎంతో అందంగా అలంకరిస్తారు. పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజ ఉత్సవాలు సెప్టెంబర్ 24న ప్రారంభమయ్యాయి. వివిధ మీడియా నివేదికల ప్రకారం, పాఠశాలలు అక్టోబర్ 6, 2025 వరకు సెలవులను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య సెలవు షెడ్యూల్‌లో తేడాలు ఉండవచ్చు.
- బీహార్: పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న బీహార్‌లో నవరాత్రి లేదా దుర్గా పూజను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ కూడా దుర్గాదేవి వివిధ రూపాలను పూజించడానికి మండపాలను (తాత్కాలిక నిర్మాణాలు) వివిధ ఇతివృత్తాల ప్రకారం అలంకరిస్తారు. బీహార్‌లోని చాలా జిల్లాల్లో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2, 2025 వరకు పాఠశాలలు మూసి ఉంటాయి. మరికొన్ని జిల్లాల్లో అక్టోబర్ 5 వరకు పాఠశాలలు మూసివేయనున్నారు.
- . ఒడిశా: ఒడిశా కూడా దుర్గా పూజ పండుగ ఉత్సాహంలో మునిగిపోయింది. ఒడిశాలోని పాఠశాలలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 2, 2025 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
- అస్సాం: అస్సాంలో 2025 సెప్టెంబర్ 29 నుంచి 30 తేదీలకు అలాగే దసరా, గాంధీ జయంతి (అక్టోబర్ 2) లకు సెలవులు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గార్గా ఆకస్మిక మరణం తరువాత అస్సాం పాఠశాలలు కూడా సంతాప దినంగా మూసివేశారు.
- జార్ఖండ్: బీహార్ సరిహద్దులో ఉన్న జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. కొన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు సెలవులు కూడా ప్రకటించాయి.
- రాజస్థాన్: 2025 సెప్టెంబర్ 26, 27 తేదీలలో రాజస్థాన్‌లో రెండు రోజుల ఉపాధ్యాయ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అన్ని ఉపాధ్యాయులు పాల్గొంటారు. అందువల్ల రెండు రోజులు పాఠశాలలు బంద్ ఉంటాయి. సెప్టెంబర్ 28 సాధారణ వారపు సెలవు (ఆదివారం). దీని తరువాత సెప్టెంబర్ 30 మహా అష్టమికి సెలవు దినంగా ప్రకటించింది రాజస్థాన్ ప్రభుత్వం. ఆ తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి, దసరాకు సెలవు దినంగా ఉంటుంది.
- లేహ్: కేంద్ర పాలిత ప్రాంతమైన లేహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టు తర్వాత, లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ రోమిల్ సింగ్ డోనాక్ శుక్రవారం నుండి రెండు రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. ఈ సమయంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు కూడా మూసి ఉంటాయి.
ఇది కూడా చదవండి: Mahindra: మహీంద్రా కారుపై బంపర్ ఆఫర్.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు
ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్‌లో ఒకదాని ధర ఎంతో తెలుసా? BMW కార్లనే కొనొచ్చు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి