School Bags: సాధారణంగా స్కూల్ బ్యాగులు రూ.500 నుంచి వెయ్యి లేదా రెండు వేల రూపాయల వరకు ఉంటుంది. మరి క్లాస్లీ ధర అనుకుంటే కాస్త ఎక్కువగా ఉండవచ్చు. ఇక్కడ మాత్రం ఒక్క స్కూల్ బ్యాగు ధర రూ.18 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ ధర జపాన్ దేశంలో. ఇక్కడ స్కూల్ బ్యాగుల (ప్రత్యేకంగా రాండోసేలు అనే బ్యాగులు) ధరలు ఎక్కువగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఇవి సాధారణంగా ¥30,000 నుండి ¥100,000 (దాదాపు రూ.18,000 – రూ.60,000) వరకు కూడా ఉంటాయి. ఇందులో ప్రధానమైన కారణాలు ఇవే.
ఇది కూడా చదవండి: Amazon: అమెజాన్ ప్యాకేజీపై ఈ గులాబీ చుక్క ఎందుకు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు కారణం ఇదే!
నాణ్యత (High Quality Materials): రాండోసేలు చాలా పక్కాగా తయారు చేస్తారు. వాటిలో Genuine leather లేదా పటిష్టమైన సింథటిక్ లెదర్ వాడతారు. వాటిని పిల్లలు 6 ఏళ్ల వయసులో కొనుగోలు చేసి 6 సంవత్సరాల పాటు ఉపయోగించగలిగేలా చేస్తారు. వాటి నిర్మాణం వెన్నెముకకు మద్దతివ్వడానికీ, బ్యాలెన్స్ మెరుగుగా ఉండడానికీ రూపొందించి తయారు చేస్తారు. పెద్ద మొత్తంలో ఈ బ్యాగులు చేతితోనే తయారు చేస్తారు. ధర పెరగడానికి ముఖ్యమైన కారణం.. వాటిలో వివరణాత్మక స్టిచింగ్, శ్రమతో చేసిన డిజైన్ ఉంటాయి.
బ్యాగ్ ఒకసారి కొనుగోలు చేస్తే 6 సంవత్సరాలపాటు మళ్లీ కొనాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలిక పెట్టుబడి అనే భావనతో తల్లిదండ్రులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. రాండోసేరు అని పిలువబడే జపనీస్ స్కూల్ బ్యాగులు ఖరీదైనవి. వాటి అధిక నాణ్యత, మన్నిక, నైపుణ్యం కారణంగా ధరలు ఎక్కువగానే ఉంటాయి. అవి ప్రీమియం పదార్థాలతో తరచుగా తోలుతో తయారు చేస్తారు. ప్రాథమిక పాఠశాల మొత్తం, సాధారణంగా ఆరు సంవత్సరాలు ఉండేలా రూపొందిస్తారు. అలాగే వాటిని తరచుగా నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు చేతితో తయారు చేస్తారు.
ఇది కూడా చదవండి: Traffic Rules: మీరు డ్రైవింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే ట్రాఫిక్ చలాన్ అస్సలు వేయరు!
ఒక వేళ పిల్లలు నీటిలో మునిగినా అవి పిల్లలు మునిగిపోకుండా కాపాడుతాయి. నీటిలో జాకెట్ ఫ్రూప్‌లా పని చేస్తాయి. బ్యాంకులు నీటిలో పడిపోయినా అవి మునిగిపోకుండా పైకి తేలుతాయి. అంతేకాదు ఆ బ్యాంకులు తడిసిపోకుండా ఉంటాయి. అంతేకాదు.. ఆ బ్యాంకుకు కింది భాగంలో ప్రత్యేకంగా లాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Bike Prices: గుడ్‌న్యూస్.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్‌లపై భారీ తగ్గింపు