Sampoornesh Babu : ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు.. ధరెంతో తెలుసా..

Sampoornesh Babu : ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు.. ధరెంతో తెలుసా..


2014లో హృదయకాలేయం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. మొదటి సినిమాతోనే ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యాడు. విభిన్న కంటెంట్ చిత్రాలతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా అలాగే చిత్రాల్లో నటించారు. మధ్యలో బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్నాడు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్యారడైజ్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సంపూ లుక్ నెట్టింట క్షణాల్లో వైరలయ్యింది. చింపిరి జుట్టు, మాసిన గడ్డంతో గొడ్డలి పట్టుకుని రౌడీ అవతారంలో కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

తాజాగా సంపూర్ణేష్ బాబు ఖరీదైన లగ్జరీ కారులో కనిపించారు. హైరాబాద్ రోడ్లపై రెడ్ కలర్ స్పోర్ట్స్ కారు వేసుకుని తిరిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో సంపూ కారెప్పుడు కొన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కనిపించిన ఆ కారు ఎంజీ సైబర్ స్టర్ బ్రాండ్ కు చెందినది అని తెలుస్తోంది. ఆ కారు ఖరీదు దాదాపు రూ.75 లక్షలకుపైనే ఉంటుంది. దీంతో ఇప్పుడు సంపూ గురించి నెట్టింట చర్చ నడుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఇదిలా ఉంటే. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన సంపూ.. ఇప్పుడు సహయ నటుడిగా మెప్పించేందుకు రెడీ అయ్యారు. ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. నాని నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *