గతంలో పోల్చితే ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. ఆ మధ్యన శుభం సినిమాతో నిర్మాతగా మారింది. ఆడియెన్స్ ను బాగానే మెప్పించిన ఈ మూవీలో ఒక కీలక పాత్ర కూడా పోషించింది సామ్. ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉంటోందీ అందాల తార. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సామ్ తో ఆమె తెరకెక్కించిన ఓ బేబీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు ఈ మధ్యన ఎక్కువగా పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది సామ్. ఆ బ్రాండ్ల ప్రమోషన్లలో భాగంగా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంటుంది. తాజాగా ఒక లగ్జరీ వాచ్ ను ధరించిన సామ్ అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సమంత ధరించిన ఆ వాచ్ ఏ కంపెనీది..? దాని ధర ఎంత ? అంటూ గూగుల్ లో ఆరా తీస్తున్నారు చాలా మంది.
ఈ నేపథ్యంలోనే సమంత ధరించిన లగ్జరీ వాచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ ను సామ్ ధరించిందని, దీని రేటు సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు. గతంలోనూ సమంత పలు స్టైలిష్ అండ్ లగ్జరీ వాచెస్ ధరించింది. బల్గారీ సర్పెంటీ వాచ్ (రూ. 45 లక్షలకు పైగానే) సామ్ చేతికి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందులోనే చాలా మోడల్స్ సామ్ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
లగ్జరీ వాచ్ తో సమంత..
ఇదిలా ఉంటే సమంత- రాజ్ ల ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ముంబై బాంద్రా లోని ఓ జిమ్ నుంచి కలిసే బయటకు వచ్చారు రాజ్- సమంత. జిమ్ నుంచి బయటకు వచ్చి ఒకే కారులో వెళ్లిపోయిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి