భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం పవర్ ప్లేలో భారత ఓపెనర్ల విధ్వంసం అని తెలిపాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ పోరులో సమష్టిగా రాణించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ను భారత్ ఓడించడం ఇది రెండోసారి.
తొలి మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడకుండా ముఖం చాటేసిన సల్మాన్ అలీ అఘా తాజా ఓటమిపై బ్రాడ్ కాస్టర్‌తో మాట్లాడాడు. మేము ఇంకా పర్ఫెక్ట్ గేమ్ ఆడలేదు. కానీ ఆ దిశగా సాగుతున్నాం. ఇది గొప్ప మ్యాచ్. కానీ పవర్ ప్లేలోనే భారత ఓపెనర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో మా నుంచి మ్యాచ్‌ని లాగేసుకున్నారు. 170 నుంచి 180 పరుగులు పోరాడే లక్ష్యమే కానీ పవర్ ప్లేలోనే భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం కూడా ఇదే.
బౌలర్లు పరుగులిస్తున్నప్పుడు బౌలర్లని మార్చాల్సి ఉంటుంది. టీ20లో ఇది సాధారణమే. ఈ మ్యాచ్‌లో ఓడిన మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఫకర్ జమాన్, షాహీన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బౌలింగ్‌లో హారిస్ రూఫ్ సత్తా చాటాడు. అటు తమకు ఫ్లాట్ పిచ్‌లు కాకుండా మరింత మంచి పిచ్‌లు ఇస్తే.. బాగా ప్రదర్శన కనబరుస్తామని సొంత దేశానికి చురకలు అంటించాడు సల్మాన్ అఘా. శ్రీలంకతో జరిగే మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని సల్మాన్ అలీ అఘా అన్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్స్ లో ఐదు వికెట్లకు 171 పరుగులు చేసింది. టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్ లు వదిలేయడం పాకిస్తాన్‌కి కలిసి వచ్చింది. లేకుంటే ఆ జట్టు ఇంకా తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.