లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ రామాయణ్ పార్ట్-1,2లతో పాటు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మూవీలోనూ నటిస్తోంది. అలాగే దక్షిణాదిలోనూ పలు సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అయితే ఇటీవల తన సినిమాల కంటే ఇతర విషయాలతో వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. సినిమాల్లో అయినా, బయటైనా సాయి పల్లవికి మంచి ఇమేజ్ ఉంది. సినిమా అవకాశాల కోసం పొట్టి డ్రెస్ లు వేసుకోవడం, స్కిన్ షో చేయడం వంటి వాటికి ఆమె చాలా దూరం. అయితే ఇటీవల సాయి పల్లవికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఎప్పుడూ పద్దతిగా కనిపించే న్యాచురల్ బ్యూటీ బికినీలో ఉందంటూ కొన్ని ఫేక్ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్ కు వెళ్లింది సాయి పల్లవి. అక్కడ ఆమె చెల్లెలు పూజా కణ్ణన్ తో కలిసి బీచ్ లో కొన్ని ఫొటోలు దిగింది. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం ఏఐ ద్వారా సాయి పల్లవి బికినీ ఫోటోలు జనరేట్ చేసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సాయి పల్లవి ఎలా బికినీల్లో తిరుగుతుందో చూడమంటూ కామెంట్స్ చేశారు. కొందరు వీటిని నమ్మినా చాలా మంది అవి ఫేక్ ఫోటోస్ అని అఅర్థం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
తాజాగా తన ఫేక్ ఫొటోలకు చెక్ పెట్టేలా ఒరిజినల్ ఫోటోలు, వీడియోలు విడుదల చేసింది సాయి పల్లవి. అందులో ఆమె ఒక వెయింగ్ మెషిన్ మీద నిలబడి తన బరువును కూడా చూపించింది. ప్రస్తుతం సాయి పల్లవి 60.6 కిలోలు ఉంది. ప్రస్తుతం ఈ వీడియ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
సాయి పల్లవి షేర్ చేసిన వీడియో ఇదిగో..
కాగా గార్గి తర్వాత కొద్దిగా సినిమాలకు గ్యాప్ఇచ్చింది సాయి పల్లవి. కానీ అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తండేల్ తో మరో వంద కోట్ల సినిమాను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.