ప్రస్తుతం దక్షిణాది సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. ట్రెడిషనల్, న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. సహజమైన నటనతో అడియన్స్ మనసులు గెలుచుకుంది. ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు.. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి లేడీ పవర్ స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాల్లోనే కాకుండా బయట సైతం ఎంతో పద్దతిగా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సినిమా వేడుకలు, అవార్డు ఫంక్షలలో ఆమె ఎక్కువగా చీరకట్టులో కనిపిస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా సాయి పల్లవికి సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..
ఇవి కూడా చదవండి
కొన్ని రోజుల క్రితం తన చెల్లితో కలిసి బీచ్ కు వెళ్లిన సాయి పల్లవి అక్కడ తీసుకున్న ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. అందులో ఆమె బికినీలో కనిపించడంతో అందరూ షాకయ్యారు. సాయి పల్లవి తీరుపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆమెకు అండగా నిలబడ్డారు. ఆ ఫోటోస్ నిజం కాదని.. ఏఐతో జనరేట్ చేసినవి ప్రచారం జరిగింది. అయితే ఈ ఫోటోస్ గురించి సాయి పల్లవి స్పందించలేదు. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ ఆ ఫోటోస్ గురించి పరోక్షకంగా రియాక్ట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
తన చెల్లితో కలిసి ఓ ట్రిప్ కు వెళ్లిన సాయి పల్లవి అందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ షేర్ చేసింది. “పైన కనిపిస్తున్న ఫోటోస్ నిజమైనవే. ఏఐ చిత్రాలు కాదు” అంటూ రాసుకొచ్చింది. దీంతో తాను బికినీ వేసుకున్నట్లు వస్తున్న ఫోటోస్ పై ఇన్ డైరెక్ట్ గా ఇచ్చిపడేసింది. దీంతో సాయి పల్లవికి మరోసారి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..