RRB Group D Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

RRB Group D Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!


RRB Group D Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 9, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌లో 1012 వరకు పోస్టులు ఉన్నాయి. ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోవచ్చు.

జోనల్‌ వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (సికింద్రాబాద్‌) పోస్టుల సంఖ్య: 1,012
  • నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వేస్‌ (జైపుర్‌) పోస్టుల సంఖ్య: 974,
  • ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే (భువనేశ్వర్) పోస్టుల సంఖ్య: 803,
  • వెస్ట్రన్‌ రైల్వే (ముంబయి) పోస్టుల సంఖ్య: 3,148,
  • నార్త్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ (ప్రయాగ్‌రాజ్) పోస్టుల సంఖ్య: 1,183,
  • సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే (హుబ్లీ) పోస్టుల సంఖ్య: 90
  • వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (జబల్‌పూర్‌) పోస్టుల సంఖ్య: 1147,
  • నార్తన్‌ రైల్వే (న్యూ ఢిల్లీ) పోస్టుల సంఖ్య: 3537,
  • సదరన్‌ రైల్వే (చెన్నై) పోస్టుల సంఖ్య: 1036;
  • నార్త్‌ ఈస్ట్రన్‌ రైల్వే(గోరఖ పుర్‌) పోస్టుల సంఖ్య: 1196;
  • నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్ రైల్వే (గువహటి) పోస్టుల సంఖ్య: 1776,
  • ఈస్ట్రన్‌ రైల్వే (కోల్‌కతా)/మెట్రో కోల్‌కతా పోస్టుల సంఖ్య: 1173,
  • సెంట్రల్‌ రైల్వే (ముంబయి) పోస్టుల సంఖ్య: 1979,
  • ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (హాజీపుర్‌) పోస్టుల సంఖ్య: 993
  • సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (కోల్‌కతా) పోస్టుల సంఖ్య: 949,
  • సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ (బిలాస్‌పుర్‌) పోస్టుల సంఖ్య: 1199

ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ అర్హత ఉత్తీర్ణత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 12 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి ప్రారంభ వేతనం ఉంటుంది. ఇతర అలవెన్స్‌లు కూడా కల్పిస్తారు.

ఆర్‌ఆర్‌బీ రైల్వే గ్రూప్‌ డీ 2026 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *