
ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్ల వంటివి బుక్ చేసుకోవచ్చు. కానీ, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి పెద్ద బైకులు కొనాలంటే కచ్చితంగా షోరూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి ఆ అవసరం కూడా లేదు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఇకామర్స్ మార్కెట్ లోకి ప్రవేశిస్తోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ బండి కావాలనుకునేవాళ్లు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేసేవిధంగా బండి ఇంటికే డెలివరీ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..
మోడళ్లు ఇవీ..
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి, రాయల్ ఎన్ ఫీల్డ్ 350సీసీ సెగ్మెంట్ బైక్ లన్నింటినీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, మీటియోర్ 350 వంటి బైక్స్ ను ఆన్ లైన్ వేదిగా కొనుగోలు చేయొచ్చు. ఈ బైకులపై జీఎస్టీ ఛార్జీలు తగ్గడంతో పాటు కస్టమర్‌లు రూ.22,000 వరకు తగ్గింపును కూడా పొందుతారు.
ప్రాసెస్ ఇదీ..
ఫ్లిప్ కార్ట్ లో బైక్ కొనాలనుకునేవాళ్లు మిగతా ప్రొడక్ట్స్ లాగానే బైక్ పేరుని సెర్చ్ చేసి.. నచ్చిన మోడల్ ను సెలక్ట్ చేసుకుని.. అడ్రెస్ వివరాలు ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇలా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న బైకును దగ్గర్లోని ఆథరైజ్డ్ డీలర్ డెలివరీ చేస్తాడు. ముందుగా బుక్ చేసుకున్న కలర్, మోడల్ ను బట్టి డెలివరీ టైం మారుతుంటుంది. ఇక ఆ తర్వాత సర్వీస్, రిపేర్స్ వంటివి.. ఏ సర్వీస్ సెంటర్ లో అయినా చేయించుకోవచ్చు.
ఇదే ఫస్ట్ టైం..
మోటార్ సైకిల్స్ ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మడం ఇదే తొలిసారి. ఈ మొడల్ సక్సెస్ అయితే మిగిలిన ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ బైక్‌లను ఆన్ లైన్ వేదికగా బుకింగ్, డెలివరీ సర్వీసులను మొదలుపెట్టొచ్చు. అయితే ప్రస్తుతం ఈ సర్వీస్ బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబైలలో సిటీల్లో అందుబాటులో ఉంటుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా అన్ని సిటీల్లో అందుబాటులోకి తీసుకొస్తామని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ చెప్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..