Robo Shankar: రోబో శంకర్ భార్య, కూతురు కూడా సినిమాల్లో నటించారని తెలుసా? తెలుగు చిత్రాల్లోనూ..

Robo Shankar: రోబో శంకర్ భార్య, కూతురు కూడా సినిమాల్లో నటించారని తెలుసా? తెలుగు చిత్రాల్లోనూ..


ప్రముఖ నటుడు రోబో శంకర్‌ మృతి చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. 46 ఏళ్ల రోబో శంకర్, చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ స్పృహ తప్పి పడిపోయిన రోబో శంకర్‌ని చిత్ర యూనిట్, ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సెప్టెంబర్ 18న రాత్రి మరణించారు. రోబో శంకర్‌ భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం స్థానిక వలసరవాక్కంలోని శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, నటుడు ధనుష్‌, శివకార్తికేయన్‌ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు రోబో శంకర్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్‌, అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి తదితరులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు.కాగారోబో శంకర్‌కు భార్య ప్రియాంక, కూతురు ఇంద్రజ ఉన్నారు.

రోబో శంకర్ భార్య పేరు ప్రియాంక శంకర్. ఈమె కూడా యాక్టరే. 2020లో ‘కన్ని మేడమ్’ సినిమాలో నటించిన ప్రియా శంకర్, కుక్కింగ్ రియాల్టీ షో ‘కుక్ విత్ కోమలీ సీజన్ 1’లో పాల్గొంది. అలాగే ‘కలక్క పోవతు యారు సీజన్ 8’లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచింది. సోషల్ మీడియాలో ప్రియాంక శంకర్‌కి దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

భర్త, కుమారుడితో ఇంద్రజా శంకర్..

ఇక కూతురు పేరు ఇంద్రజా శంకర్. ఈమె తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. 2019లో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’)మూవీలో ఇంద్రజా శంకర్ ఓ కీలక పాత్రలో నటించింది. అందులో గుండమ్మగా నటించి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తెలుగులో విశ్వక్‌ సేన్ ‘పాగల్’ మూవీలో నూ, కార్తీ నటించిన ‘విరూమాన్’ సినిమాల్లోనూ కీలక పాత్రల్లో ఇంద్రజ యాక్ట్ చేసింది. ఇక 2024, ఫిబ్రవరి 2న తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది ఇంద్రజ. అదే ఏడాది మార్చిలో చెన్నై వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. భార్యాభర్తలు కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ చిన్నతిరాయ్ సీజన్ 5’లో కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఇంద్రజ- కార్తీక్ దంపతులకు ఒక పండంటి బాబు పుట్టాడు.

హీరో ఆది పినిశెట్టితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *