తెలుగమ్మాయి రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే ఆకట్టుకుంది.
2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది రీతూ వర్మ. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా.. ఈ చిన్నది తన నటనతో మెప్పించింది. ఆతర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది. ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది. ఇటీవలే శ్రీవిష్ణుతో స్వాగ్ , సందీప్ కిషన్ తో మజాకా సినిమాలు చేసింది.
ఈ రెండు సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా యావరేజ్ గా మిగిలాయి. ఇప్పుడు ఈ చిన్నది ఓ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందు రానుంది. దేవిక అండ్ డానీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రానుంది. ఈ క్రమంలోనే రీతూ వర్మ కొన్ని క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు నెటిజన్స్ ను కట్టిపడేస్తున్నాయి.