ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉంటోన్న రీతూ చౌదరిపై టాలీవుడ్ హీరో ధర్మమహేష్ భార్య గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో రీతూ అఫైర్ పెట్టుకుందంటూ ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ముఖ్యంగా తాను గర్భంతో ఉన్నప్పుడు మహేశ్, రీతూ బాగా దగ్గరైపోయరని గౌతమి వాపోయింది. ప్రస్తుతం ధర్మ మహేష్- రీతూ చౌదరీల ప్రైవేట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అయితే బయట జరుగుతున్న ఈ వ్యవహారం గురించి బిగ్ బాస్ లో ఉన్న రీతూ చౌదరికి తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలిసినా ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే గౌతమి ఆరోపణలు, రీతూ చౌదరితో రిలేషన్ షిప్ లపై హీరో ధర్మ మహేశ్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడిన అతను..
‘ బయట ఎవరో ఏదో అనుకుంటున్నట్లు నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే! తనను ఒక ఫ్రెండ్‌లా మాత్రమే చూస్తాను. మా బెడ్‌రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా.. కావాలంటే రీలీజ్ చేసుకోమనండి. తను (గౌతమి) నా కొడుకుని నాకు చూపించడం లేదు. ఈ వ్యవహారంతో నేను పూర్తిగా డిప్రెషన్‌లో మునిగిపోయాను. సెటిల్మెంట్ చేస్తేనే నా బిడ్డను చూపిస్తామన్నారు. ఈ గొడవలో నా కొడుకును ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. నేనున్న ఇంటిని కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధాలు చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా. అందుకు నేను కూడా రెడీగా ఉన్నాను. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను’ అని ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం ధర్మ మహేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై అతని భార్య గౌతమి ఎలా స్పందిస్తుందో చూడాలి.
నెట్టింట వైరలవుతోన్న ధర్మ మహేష్, రీతూ చౌదరి వీడియో..
హీరోతో దొరికిపోయిన రీతు చౌదరి….
డ్రగ్స్ కూడా తీసుకుందట…
ఈ వీడియో వైరల్ అవుతుంది #Rithuchowdary #BiggBoss #Biggboss9telugu #BigGirlFall pic.twitter.com/d0tF2iDcBe— Megha (@MovieloverMegha) September 22, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి