ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతార: చాప్టర్ 1. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడిగా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం అందిస్తున్నారు. బాధ్యతలన్నింటినీ స్వీకరించడం ఒక పెద్ద సవాలు. ఆయన ఈ సవాలును విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి రిషబ్ శెట్టి ఏ స్థాయిలో పారితోషికం తీసుకుంటారు అనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ నడుస్తుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
స్టార్ హీరోస్ అందరూ సినిమాకు పారితోషికం కాకుండా సినిమాల్లో లాభాల్లో వాట తీసుకుంటున్నారు. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి చాలా మంది స్టార్లు సినిమా విజయం తర్వాత వచ్చే కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నారు. ఇప్పుడు రిషబ్ శెట్టి సైతం అదే పనిచేయనున్నారని సమాచారం. కన్నడలో చాలా మంది ఆర్టిస్టులు తమ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుని తీసుకుంటారు. సినిమా హిట్ అయినా, కాకపోయినా అది నిర్మాతలపైనే పడుతుంది. ఇప్పుడు కాంతార 1 చిత్రానికి రిషబ్ శెట్టి అదే చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి రిషబ్ శెట్టి ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో అతనికి హోంబాలే ఫిల్మ్స్ నుండి లాభం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదల కానుంది. ప్రీమియర్ అక్టోబర్ 1న ఉండనున్నాయి. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..