Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..


మాస్ మాహారాజా రవితేజ.. ఎలాంటి సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో అవమానాలు, సవాళ్లను దాటుకుని ఇప్పుడు తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతో మంది కుర్రాళ్లకు స్పూర్తిగా నిలిచారు. అయితే రవితేజ జీవితంలో ఓ దారుణమైన అవమానం గురించి రచయిత కోన వెంకట్ బయటపెట్టారు. ఆయన నిర్మాణంలో వస్తున్న లేటేస్ట్ సినిమా బ్యాండ్ మేళం. ఇందులో కోర్ట్ జంట రోషన్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే రవితేజ ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

ఈ ప్రమోషన్లలో భాగంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘ఒక కొత్త లిరిక్ రైటర్ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, లంచ్ సమయంలో ఒక ప్రొడక్షన్ ఆఫీసులో కూర్చుని భోజనం చేస్తుండగా, ఆ నిర్మాత “అడ్డమైన వాళ్ళందరినీ తీసుకువస్తారా?” అంటూ అవమానించారు. ఈ సంఘటన ఆ గీత రచయితను తీవ్ర నిరాశలోకి నెట్టింది. అయితే, అదృష్టవశాత్తు, అదే సమయంలో కోన వెంకట్ అతడిని సంప్రదించి ఒక బ్లాక్‌బస్టర్ పాటను రాయించారు, అది అతని కెరీర్‌ను మార్చేసింది. ఈ సంఘటనలో ఒక చిన్న మాట ఎలా మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది” అంటూ కోన వెంకట్ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఇలాంటి ఘటనే మాస్ మహారాజా రవితేజ జీవితంలోనూ చోటు చేసుకుందని కోన వెంకట్ వెల్లడించారు. రవితేజ తన కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, ఒక ప్రొడక్షన్ హౌస్‌లో లంచ్ చేస్తున్న సమయంలో ఒక నిర్మాత అతనిని కించపరిచేలా మాట్లాడాడని తెలిపారు. “వీడెవడు? అడ్డమైన వాళ్లందరూ వచ్చి తింటారా?” అన్నట్లుగా ఆ నిర్మాత రవితేజను అవమానించారని, ఇది రవితేజకు తీరని వేదన కలిగించిందని కోన వెంకట్ పేర్కొన్నారు. అయితే, రవితేజ ఈ అవమానాన్ని తన విజయానికి మెట్లుగా మలచుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని, ఎంతో పట్టుదలతో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి మాస్ మహారాజాగా ఎదిగారు. ఈ ప్రయాణంలో రవితేజ అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేక మార్కును ఏర్పరుచుకున్నారు. ఒకానొక రోజు, రవితేజను అవమానించిన అదే నిర్మాత తన సినిమా కోసం రవితేజ డేట్ల కోసం అతని మేకప్ వ్యాన్ బయట వేచి ఉన్నాడని కోన వెంకట్ వెల్లడించారు. రవితేజ, ఆ నిర్మాత అడిగినప్పుడు డేట్లు ఇచ్చి అతని బ్యానర్‌లో సినిమా చేయడం ద్వారా తన నిజమైన విజయం ఏమిటో నిరూపించారని కోన వెంకట్ ప్రశంసించారు. అవమానించిన వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవడం కాకుండా, వారిని గౌరవించి, పనిని పూర్తి చేయడం రవితేజ ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *