Headlines

Ravi Teja: ప్రాణాలకు తెగించి లోయలో పడిపోతోన్న హీరోయిన్‌ని కాపాడిన రవితేజ.. మాస్ మహారాజా ధైర్యానికి హ్యాట్సాఫ్

Ravi Teja: ప్రాణాలకు తెగించి లోయలో పడిపోతోన్న హీరోయిన్‌ని కాపాడిన రవితేజ.. మాస్ మహారాజా ధైర్యానికి హ్యాట్సాఫ్


Ravi Teja: ప్రాణాలకు తెగించి లోయలో పడిపోతోన్న హీరోయిన్‌ని కాపాడిన రవితేజ.. మాస్ మహారాజా ధైర్యానికి హ్యాట్సాఫ్

మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఆయన ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. రవితేజతో పని చేసిన నటీనటులందరూ ఈ విషయాన్ని తరచూ చెబుతూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఆడియెన్స్ ను అలరించాడు రవితేజ. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే రవితేజ గురించి టాలీవుడ్ నటి ఒకరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. రవితేజ, గుణ శేఖర్ కాంబినేషన్ లో నిప్పు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2012లో రిలీజైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాలో దీక్షాసేథ్, శ్రీకాంత్, భావన, రాజేంద్ర ప్రసాద్ ఇలా చాలా మంది స్టార్స్ వివిధ పాత్రల్లఓ నటించారు. అలాగే కితకితలు హీరోయిన్ గీతా సింగ్ ఒక కీలక పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే సందర్భంలో నిప్పు సినిమాలో హీరో రవితేజతో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకుంది.

‘నిప్పు సినిమా ఒక షాట్ లో నేను లోయలో పడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు రవితేజ నన్ను కాపాడాడు. ఆరోజు ఆయన అలెర్ట్ గా లేకుండా, నన్ను పెట్టుకోక పోయుంటే నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చునేదానిని కాదు. రవితేజ అంటే నాకు మొదటి నుండి క్రష్. షూటింగ్ లో ఆయన అందరితో సమానంగా ఉండేవాడని. చాలా ఫ్రెండ్లీ స్వభావం ఉన్న మనిషి’అని రవితేజ గురించి చెప్పుకొచ్చింది గీత. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.

గీతాసింగ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh)

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇరుముడి అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. గతంలో నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో కథానాయికగా నటించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, రవితేజ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని థియేటర్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *