Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..

Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..


Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా మనసుపడ్డవాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికారు. అయితే ఈ సంతోషకర సమయంలో ఆమె తల్లి సుమన్‌ మందన్నాకు సంబంధించిన ఓ పాత ఆడియో క్లిప్‌ కటి నెట్టింట తెగ వైరలవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రష్మిక గురించి, ఆమె కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఈ విషయంపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మీడియా వర్గం ఎనిమిదేళ్లుగా నాపై అసత్యప్రచారం చేస్తూ, తనను టార్గెట్‌ చేస్తూ వేధిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల వ్యూస్‌, రీచ్‌ కోసం తాను అనని మాటల్ని కూడా అన్నట్లుగా తప్పుడు కథనాల్ని రాస్తున్నారన్నారు. అది తననెంతో బాధపెట్టినా తాను మౌనంగా ఉన్నానని.. కానీ గడిచిన 24 గంటల్లో వారు హద్దులు దాటి తనపై తీవ్ర దుష్ప్రచారం చేశారన్నారు రష్మిక. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలోని కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని. సీరియస్ అయ్యారు.మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ పోస్టులను 24 గంటల్లో తొలగించాలంటూ రష్మిక వార్నింగ్ ఇచ్చారు. ఆలోపు వాటిని తొలగించకపోతే రేపటి నుంచి సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు

నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి

సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *