Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది

Rare Bird: జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది


జనగామ జిల్లాలో ఒక అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారుల కంటపడిన ఈ పక్షి, ‘బార్న్ ఓవల్’ (Barn Owl) జాతికి చెందినదిగా అధికారులు గుర్తించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో కొందరు బాటసారులకు రోడ్డు పక్కన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక పక్షి కనిపించింది. గోధుమ, బంగారం మరియు తెలుపు వర్ణాల కలయికతో మెరిసిపోతున్న ఆ పక్షిని చూడగానే వారు అప్రమత్తమయ్యారు. అది సాధారణ పక్షి కాదని గుర్తించి, వెంటనే దానిని ఒక బాక్స్‌లో భద్రపరిచి జనగామ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు. పక్షిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని, పక్షిని పరిశీలించారు. దీని ముఖం గుండె ఆకారంలో ఉండి, ఎంతో ఆకర్షణీయంగా ఉందని, దీని శాస్త్రీయ నామం ‘టైటో ఆల్బా’ అని, ఈ జాతి పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయని, పర్యావరణ సమతుల్యతలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ పక్షిని సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరుదైన పక్షిని కాపాడి బాధ్యత చాటుకున్న బాటసారులను అధికారులు, పోలీసులు అభినందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర

మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *