మాజీ సీఎం జగన్ ను అమితంగా అభిమానిస్తాడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే ఆయన జీవిత కథ ఆధారంగా వ్యూహం సినిమాను కూడా తెరకెక్కించాడు. ఇదే క్రమంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ పరోక్షంగా ట్వీట్స్ వేసేవాడు. కొన్ని సందర్భాల్లో ఆర్జీవీ పోస్టులు కాంట్రవర్సీకి కూడా దారి తీశాయి. మెగాభిమానులు కూడా ఆర్జీవీ పేరెత్తితేనే భగ్గుమంటారు. అయితే తాజాగా మరోసారి మెగాఫ్యామిలీ గురించి ఒక ట్వీట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అది ఇప్పుడు వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 47 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి.. ‘ 22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనే నేను ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా మీకు పరిచయమై నేటికి 47 ఏళ్లయింది. నటుడిగా నాకు ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబసభ్యుడిగా, మెగాస్టార్‌గా నన్ను అనుక్షణం ఆదరించి అభిమానించిన తెలుగు సినీ ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు మెగాస్టార్.
చిరంజీవి ట్వీట్ కు స్పందించిన పవన్ కల్యాణ్ తన అన్నయ్యకు అభినందనలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు. ‘ఈ 47 ఏళ్ల ప్రయాణంలో అన్నయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నాడు. ఇతరులకు అండగా నిలిచే గుణాన్ని, సాయపడే అలవాటును ఎప్పుడూ వదులుకోలేదు. మా పెద్దన్నయ్య పుట్టుకతోనే ఫైటర్ అని, ఆయన కోరుకుంటే తప్ప రిటైర్‌మెంట్ ఉండదని’ పవన్ చిరంజీవికి విషెస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి
చిరంజీవి- పవన్ కల్యాణ్ ట్వీట్ లపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ‘మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక మెగా పవర్ అందించినట్లే అవుతుంది. అదే ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్..
And you both will be doing the entire telugu people of the world a MEGA POWER favour, if you do a film together , and that will be the MEGA POWER film of the CENTURY 💪 https://t.co/BgrrCzTnC8
— Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.