Ram Charan : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ బర్త్ డేకు డబుల్ ట్రీట్.. ఇక థియేటర్లలో రచ్చే..

Ram Charan : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ బర్త్ డేకు డబుల్ ట్రీట్.. ఇక థియేటర్లలో రచ్చే..


Ram Charan : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ బర్త్ డేకు డబుల్ ట్రీట్.. ఇక థియేటర్లలో రచ్చే..

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ నట వారసుడిగా తెరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. చిరు తర్వాత చరణ్ సినిమాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చెర్రీ బర్త్ డే ఘనంగా జరుపుకోవడానికి మెగా అభిమానులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చరణ్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అనే ఆసక్తి అభిమానుల కళ్లల్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ ఏడాది చరణ్ బర్త్ డే అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారని టాక్. పెద్ది సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ రానుందని సమాచారం. చరణ్ బర్త్ డే రోజున పెద్ది టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

మరోవైపు పెద్ది సినిమా తర్వాత చరణ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరు కలిసి మరోసారి సినిమా చేయనుండడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్సీ 17 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సారి చరణ్ బర్త్ డేకు మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *