Ram Charan: అయ్యప్పమాలలో ప్రీ వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. వివాదంపై స్పందించిన  అల్లు శిరీష్

Ram Charan: అయ్యప్పమాలలో ప్రీ వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. వివాదంపై స్పందించిన  అల్లు శిరీష్


అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయిన సంగతి తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్‌-నయనికల గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అందులో అల్లు శిరీష్- నయనిక, స్నేహా రెడ్డి, రామ్ చరణ్, ఉపాసన తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ఈ పార్టీలో పాల్గొనడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మద్యం, మాంసం ఉంటాయని మరి అలాంటప్పుడు మెగా హీరో పార్టీకి ఎలా వచ్చాడని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ దీనిపై స్పందించాడు. రామ్ చరణ్ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కు పూర్తి వివరణ ఇచ్చాడు.

‘ మా పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. రామ్ చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే వచ్చాడు. మాకు శుభాకాంక్షలు చెప్పి వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. రామ్ చరణ్ వెళ్లిన తర్వాతే పార్టీ మొదలైంది. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో అందరికీ తెలుసు. ఈ మాలలో ఉన్నప్పుడు రామ్ చరణ్ బయట కనీసం నీళ్లు కూడా చరణ్‌ తీసుకోరు’ అని శిరీష్ క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా సుమారు 20 ఏళ్లుగా అయప్ప స్వామి మాలను ధరిస్తున్నాడు రామ్ చరణ్. అలాగే ఆంజనేయ స్వామి మాలలోనూ కనిపిస్తుంటాడు. ఇలా భక్తి మార్గంలో ఉండడం వల్ల తనను తాను క్రమశిక్షణా ఉంటానని పలు సందర్భాల్లో రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

పెద్ది సినిమా సెట్ లో రామ్ చరణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *