Rakul Preeth Singh : అవార్డ్స్ ఫంక్షన్‏లో రకుల్‏కు చేదు అనుభవం.. క్లారిటీ ఇచ్చిన జగ్గీ.. వీడియో వైరల్..

Rakul Preeth Singh : అవార్డ్స్ ఫంక్షన్‏లో రకుల్‏కు చేదు అనుభవం.. క్లారిటీ ఇచ్చిన జగ్గీ.. వీడియో వైరల్..


రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2011లో కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా అడియన్స్ దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామర్ తోపాటు నటనలో తనదైన ముద్ర వేసిన రకుల్.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా ఓ ప్రైవేట్ వేడుకలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఒక ప్రైవేట్ అవార్డు వేడుకలో నటి రకుల్ ప్రీత్ సింగ్ వేదికపై అవార్డ్స్ ప్రదానం చేస్తున్నారు. ఈ సమయంలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జగ్గీ అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్ పైకి వచ్చారు. అవార్డ్ తీసుకుంటున్నప్పుడు కనీసం రకుల్ వైపు చూడకుండా.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీంతో అవాక్కైన రకుల్..మరోవైపు చూస్తూ ఉండిపోయింది. దీంతో జగ్గీ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. చూడకుండా వెళ్లిపోవడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జగ్గీ ఈ ఘటనపై స్పందించారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ఆ వీడియోలో జగ్గీ మాట్లాడుతూ.. తనకంటే ముందు అవార్డ్ తీసుకున్న మహిళకు రకుల్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనించానని.. అందుకే తాను కూడా సాధారణంగా అవార్డు తీసుకుని వెళ్లిపోయానని అన్నారు. ఇది వ్యక్తిగత అసహనం కాదని.. అక్కడ పరిస్థితిని చూసి అదే ఫాలో అయ్యానని చెప్పుకోచ్చారు. ఇది అవమానించడం కాదని స్పష్టం చేశారు. ఈ ఘనటపై రకుల్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *