Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్


Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

ఈ మధ్య ఎక్కడ మైక్ దొరికినా కాస్త వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. తమిళ లెజెండరీ నటుడు MGR‌నే అవమానించేలా మాట్లాడిన రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నటుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై కోలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. MGR‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోలీవుడ్ ఆరోపిస్తుంది. కాంతారావును పొగడడానికి MGR‌ను కించపరుస్తారా.? రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పాలని నడిగర్ సంఘం డిమాండ్  చేసింది.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి

తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి MGRపై నోరు జారారు రాజేంద్రప్రసాద్. కాంతారావు జాతీయ పురస్కారం అందుకున్న రాజేంద్ర ప్రసాద్‌ సన్మాన సభలో.. కాంతారావు గొప్పదనం గురించి చెబుతూ ఒక్కసారిగా
గీత దాటారు. జానపద చిత్రాల్లో కాంతారావుగారి కత్తి సాము, ఆయన నటనను చూసి భయంతో తమిళ గ్రేటెస్ట్ హీరో MGR పోసుకునేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు నటుడు నాజర్. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే హీరో విశాల్ కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.

20 ఏళ్ల ముందు చూసుంటేనా..! ఆ హీరోయిన్ తల్లిపై రాఘవేంద్రరావు షాకింగ్ కామెంట్స్

మన తెలుగు సినిమా పరిశ్రమలోని సీనియర్ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను చూసి షాక్ అయ్యాను. డియర్ సర్, అత్యంత గౌరవంతో అదే సమయంలో భారమైన హృదయంతో స్పందిస్తున్నా.. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరున్న మన దివంగత దిగ్గజ నటుడు MGR గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నాను . మరొక దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం ఒక అందమైన సంజ్ఞ, అదే సమయంలో మరొక దిగ్గజ నటుడు MGR గారిని కించపరచడం మన ప్రజల మనోభావాలకు మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, అతి ముఖ్యమైనదో మీకు బాగా తెలిసిన విధంగా దీన్ని ముగించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైనా మీ స్థాయి నటుడి గురించి చెడుగా మాట్లాడితే, నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను కాబట్టి మీరు ఈ సమస్యకు క్షమాపణ చెబుతున్నారని భావిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో విశాల్ రాసుకొచ్చారు.

Anushka: ఆ స్టార్ హీరో నన్ను పేరు మార్చుకోమన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన అనుష్క

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *