వర్షం వస్తుందేమో అన్న భయంతో బయటకు వెళ్లకుండా ఉండలేము. అలాగని వర్షంలో బయటా తడవలేము. అందుకే మనం ఉండే ఏరియా లేదా వెళ్లబోయే ఏరియాలో వర్షం ఉందో లేదా తెలుసుకుంటే ఒక టెన్షన్ తప్పుతుంది. దీనికోసం కొన్ని బెస్ట్ యాప్స్ ఉన్నాయి. అవేంటంటే..
ది వెదర్ ఛానల్
ది వెదర్ ఛానల్ అనే యాప్ లో వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన అన్ని అప్ డేట్స్ పొందొచ్చు. ఇందులో మీ ఏరియా నేమ్ ఎంటర్ చేసి.. అక్కడి వాతావరణ సూచనలు పొందొచ్చు. ఈ యాప్ లో గంటల వారీగా, రోజుల వారీగా కూడా అప్ డేట్స్ ఉంటాయి. లైవ్ రాడార్ సిగ్నల్స్ ద్వారా ఈ యాప్ దాదాపు ఖచ్చితమైన అప్ డేట్స్ ఇస్తుంది.
ఆక్యూ వెదర్
ప్లే స్టోర్‌లో ‘ఆక్యూ వెదర్’ అని టైప్ చేసి యాప్ ఇన్‌స్టా్ల్ చేసుకోండి. ఈ యాప్.. రోజులో ఏయే టైంలో ఎంత వర్షం పడుతుంది అనే వివరాలు అందిస్తుంది. ఈ యాప్ కూడా ఏరియా వారీగా అప్ డేట్స్ ఇస్తుంది. లైవ్ మ్యాప్ డీటెయిల్స్‌తో పాటు గాలి వేగం, గాలి డైరెక్షన్ వంటి అప్ డేట్స్ కూడా ఉంటాయి.
గూగుల్ మ్యాప్స్ లో..
గూగుల్ మ్యాప్స్‌లో నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోవడం ద్వారా మీ ఏరియాలో వరదలు, తుఫాన్‌ల వంటివి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆటోమెటిక్ అలెర్ట్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ రూట్‌లో ఏవైనా రెడ్ అలెర్ట్స్ ఉంటే నోటిఫికేషన్స్ వస్తాయి. దీనికోసం గూగుల్ మ్యాప్స్‌లో ప్రోఫైల్ మీద క్లి్క్ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి. నోటిఫికేషన్స్‌ను ఆన్‌లో పెట్టుకోవాలి.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..