తెలంగాణకు మళ్లీ వర్షాలు దండయాత్ర చేయనున్నాయి. సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిమీ ఎత్తులో ఉండి ఎత్తు పెరిగే కొద్దీ ఉపరితల ఆవర్తనం నైరుతి దిక్కుకు వాలి ఉంది. ఈశాన్య అరేబియన్ సముద్రంలోకి తీవ్ర అల్పపీడనం ప్రవేశించింది. తీవ్ర అల్పపీడనం బలపడి తిరిగి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. గుజరాత్ విదర్భ, దక్షిణ ఛత్తీస్గడ్ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా పశ్చిమ బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. రేపు(బుధవారం) ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురవనున్నాయి.
రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. కాగా, ఏపీలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు మోత మోగిస్తున్నాయి.