Railway Stations: దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఏది ఉందో తెలుసా?

Railway Stations: దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే.. ఫస్ట్‌ ప్లేస్‌లో ఏది ఉందో తెలుసా?


భారత దేశ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా కొనసాగుతుంది. మన దేశంలో ఉన్న మొత్తం 7,308 స్టేషన్లలో రోజుకు 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఈ సేవల ద్వారా భారత రైల్వే భారీగా ఆధాయాలను గడిస్తుంది. అయితే దేశంలోని ఒక్క స్టేషన్ మాత్రమే కేవలం ఒక సంవత్సరంలో రూ.3,337 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, దేశంలోనే అత్యంత ధనిక రైల్వే స్టేషన్‌గా నిలిచింది. అదే భారత రైల్వే ఆర్థిక వ్యవస్థలో కిరీట రత్నంగా మారిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌. 2023–24 ఆర్థిక సంవత్సరం డేటా ప్రకారం.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ₹3,337 కోట్ల వార్షిక ఆదాయంతో ఆదాయాల చార్టులో అగ్రస్థానంలో ఉంది, రోజువారీ రద్దీ, అధిక టిక్కెట్ల అమ్మకాలు, వాణిజ్య దుకాణాలు, ప్రకటనలు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల సేకరణలు వలనే ఈ స్టేషన్‌ ఈ పీట్‌ను సాధించింది.

రైల్వే స్టేషన్లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

  • రైల్వే స్టేషన్లు కేవలం టికెట్స్‌ అమ్మడం ద్వారానే కాకుండా అనే మార్గాల ద్వారా ఆదాయాలను సంపాధిస్తాయి.
  • ప్రయాణీకుల టికెటింగ్, రిజర్వేషన్
  • స్టాల్స్, ఫుడ్ కోర్టులు, ఇతర సౌకర్యాలను లీజుకు తీసుకోవడం
  • స్టేషన్ ఆవరణ లోపల, వెలుపల ప్రకటన ఒప్పందాలు
  • పార్శిల్, సరుకు రవాణా సేవల నుండి వసూలు చేసే ఛార్జీలు
  • ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు, వెయిటింగ్ రూమ్ యాక్సెస్ ఇలా అనేక మార్గాల ద్వారా స్టేషన్‌లు ఆధాయాలను ఆర్జిస్తాయి

భారతదేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే టాప్ 5 రైల్వే స్టేషన్లు ఇవే

  • న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ – రూ. 3,337 కోట్లు
  • హౌరా జంక్షన్ (కోల్‌కతా) – రూ. 1,269.2 కోట్లు
  • చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ రూ. 1,299 కోట్లు
  • సికింద్రాబాద్ జంక్షన్ (తెలంగాణ) రూ. 1,276 కోట్లు
  • హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) – రూ.1,227 కోట్లు

అయితే ఆదాయం పరంగా, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా హౌరా స్టేషన్ రెండవ స్థానంలో ఉండగా, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CST) , ఆదాయం పరంగా మొదటి ఐదు స్థానాల్లో లేనప్పటికీ, అత్యధిక ప్రయాణీకుల రద్దీలో మాత్రం మొదటి స్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *