రాహుల్ దేవ్.. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి అదరగొట్టాడు. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాహుల్ దేవ్.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా అతడు హిందీలోనే సినిమాలు చేస్తున్నారు. అయితే రాహుల్ దేవ్.. ఇప్పుడు తనకంటే 18 సంవత్సరాలు చిన్నదైన మరాఠీ నటితో డేటింగ్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఇవి కూడా చదవండి
రాహుల్ దేవ్ విషయానికి వస్తే.. ఆయన 1968 సెప్టెంబర్ 27న ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. దీంతో చిన్నప్పటి నుంచే తన ఇంట్లో క్రమశిక్షణా వాతావరణం ఉండేది. రాహుల్ 2000 సంవత్సరంలో ‘ఛాంపియన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో అతను విలన్ పాత్రను పోషించాడు. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించారు. 2009 లో, రాహుల్ భార్య రీనా దేవ్ క్యాన్సర్ కారణంగా మరణించింది. ఆమె మరణం తర్వాత కొన్నాళ్ల ఒంటరిగానే జీవించాడు. కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటున్న సమయంలోనే అతడికి మోడల్, నటి ముగ్ధా గాడ్సే పరిచయమైంది. ఆమె రాహుల్ కంటే 18 సంవత్సాలు చిన్నది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
వీరిద్దరి పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లకు ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వారి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరు 2013 నుంచి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారిద్దరూ ఇంకా వివాహం చేసుకోలేదు. ముగ్దా గాడ్సే.. మరాఠీ చిత్రపరిశ్రమలో పాపులర్ నటి. అలాగే మోడల్ కూడా. ఆమె అజయ్ దేవగన్, సంజయ్ దత్‌లతో కలిసి పనిచేసింది. ఆమె ‘ఫ్యాషన్’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?