సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గీత మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివంగత సీనియర్ నటుడు ఎం.ఆర్ రాధా భార్య. తమిళ చిత్ర పరిశ్రమ, సామాజిక వర్గాలకు ఆమె ఎంతో కృష్టి చేశారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
గీత అంత్యక్రియలు సోమవారం, 22 సెప్టెంబర్ 2025 సాయంత్రం 4.30 గంటలకు బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. శ్రీమతి గీతా రాధ తన జీవితాన్ని కుటుంబానికి, ప్రేమను ప్రజలకు అంకితం చేశారు. వెనుకబడిన ప్రాంతాలలో అనేక సామాజిక సేవలకు కూడా ఆమె దోహదపడింది. నటుడు ఎం.ఆర్. రాధ వారసత్వాన్ని కొనసాగించడంలో, కుటుంబాన్ని నడిపించడంలో సామాజిక సేవ చేయడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె మృతి పట్ల అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..