Priyanka Chopra: వైన్ కలర్ డ్రెస్.. తలపై జడతో కిరీటం! ప్రియాంక చోప్రా డ్రెస్ ధరతో లగ్జరీ కారు కొనేయొచ్చు

Priyanka Chopra: వైన్ కలర్ డ్రెస్.. తలపై జడతో కిరీటం! ప్రియాంక చోప్రా డ్రెస్ ధరతో లగ్జరీ కారు కొనేయొచ్చు


తన సినిమాలోని పాత్ర గంభీరతను ప్రతిబింబించేలా ఆమె చేసిన ఈ సరికొత్త ఫ్యాషన్ సంగతులేంటో తెలుసుకుందాం.. ఆమె అడుగు వేస్తే అది ఒక ట్రెండ్.. ఆమె కట్టుకుంటే అది ఒక ఫ్యాషన్. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన ప్రతిభా పాటవాలతో అందరినీ అలరిస్తున్న ఆమె, ఇప్పుడు ‘ది బ్లఫ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఒక ప్రత్యేకమైన అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒకవైపు హాలోవీన్ వైబ్స్, మరోవైపు మోడరన్ ఎలిగెన్స్ కలగలిసిన ఆ వినూత్న వేషధారణలో ఉన్న ఆ స్టార్ మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా.

దుస్తుల ప్రత్యేకత..

ప్రియాంక చోప్రా ఈ ప్రమోషన్ల కోసం వైన్ టోన్డ్ సిల్క్-శాటిన్ దుస్తులను ఎంచుకుంది. హాల్టర్ నెక్ మరియు బ్యాక్‌లెస్ డిజైన్‌తో కూడిన టాప్ ఆమెకు ఒక డ్రామాటిక్ లుక్ ఇచ్చింది. నడుము దగ్గర ఉన్న గ్యాదర్డ్ డిటెయిల్స్ ఆమె రూపానికి ఒక స్మూత్ ఫినిషింగ్‌ను అందించాయి. దీనికి జతగా ఆమె శాటిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో చేసిన హరేమ్ ప్యాంట్స్ ధరించింది. ఈ ప్యాంట్స్ యొక్క అసమానమైన వేస్ట్‌బ్యాండ్ ఆమె నావెల్ పియర్సింగ్‌ను హైలైట్ చేస్తూ, సినిమాలో ఆమె పోషిస్తున్న ‘ఎర్సెల్’ పాత్రలోని తీవ్రతను ప్రతిబింబించింది.

జిమ్మెర్‌మాన్ బ్రాండ్‌కు చెందిన ఈ అవుట్‌ఫిట్ ధర ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హాల్టర్ నెక్ టాప్ ధర- రూ.77,700, హరేమ్ ప్యాంట్స్ ధర- రూ. 1,43,300.. అంటే కేవలం ఈ డ్రెస్ మొత్తం ఖరీదు అక్షరాలా రూ.2,21,000. ఇది మాత్రమే కాదు, ఆమె పాదాలకు ధరించిన కాసాడెయి బ్రాండ్ ‘సమురాయ్ బ్లేడ్ పంప్స్’ ధర సుమారు రూ. 42,418. ఇలా తల నుండి కాలి వరకు ఆమె ధరించిన వస్తువుల విలువ చూస్తుంటే సామాన్యులకు అందని ద్రాక్షలానే అనిపిస్తుంది.

ప్రియాంక ఈ లుక్ కోసం తన జుట్టును రకరకాల జడలతో అలంకరించుకుంది. ఒక జడను తన తల చుట్టూ కిరీటంలా చుట్టుకోవడం ఒక హైలైట్ అని చెప్పవచ్చు. ముఖానికి బ్రౌన్ మరియు న్యూడ్ పింక్ టోన్లలో మేకప్ వేసుకుని, షార్ప్ కాంటౌరింగ్‌తో కనిపించింది. ఒక ఫోటోలో ఆమె ధరించిన బ్లాక్ హ్యాట్ మరియు మెడలోని భారీ బంగారు రంగు నగలు ఆమె వ్యక్తిత్వానికి మరింత మెరుపుని జోడించాయి.

గ్లోబల్ ఫ్యాషన్ వేదికలపై ప్రియాంక చోప్రా ఎప్పుడూ భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ‘ది బ్లఫ్’ సినిమాలో పైరేట్ గా నటిస్తున్న ఆమె, ఆ పాత్రకు తగ్గట్టుగానే తన ఫ్యాషన్ స్టైల్‌ను మార్చుకుంది. ఈ ఖరీదైన అవుట్‌ఫిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *