
ప్రస్తుతం ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి. తక్కువ ధరలో మంచి పవర్ బ్యాంక్ కొనాలంటే ఇదే అనువైన సమయం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పవర్ బ్యాంక్స్ లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ పరంగా బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
షావోమీ 4ఐ
ఇది రూ. 2 వేల బడ్జెట్ లో లభిస్తుంది. షావోమీ బ్రాండ్ కు చెందిన ఈ పవర్ బ్యాంక్ 20,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. టైప్-సీ ఛార్జింగ్, మైక్రో-యుఎస్బీ పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది.
అంబ్రేన్ పాకెట్ సైజ్
అంబ్రేన్ పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ 20,000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. కానీ, దీని సైజు చాలా చిన్నదిగా పాకెట్ సైజులో ఉంటుంది. ఇది 22.5 వాట్ ఛార్జింగ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. దీని ధర రూ. 1500 ఉంటుంది. డ్యూయల్ యుఎస్బీ పోర్ట్స్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
రియల్మీ పవర్ బ్యాంక్ 2ఐ
వెయ్యి రూపాయల లోపే లభించే ఈ పవర్ బ్యాంక్ 10,000ఎంఏహెచ్ కెపాసిటీతో వస్తుంది. రెండు యూఎస్బీ- పోర్ట్స్, టైప్-సీ, పోర్టు ఉంటుంది. 12వాట్ క్విక్ ఛార్జ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.
సిస్కా పీ-1037
ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ సిస్కా నుంచి సిస్కా పీ1037 అనే పవర్‌బ్యాంక్ అందుబాటులో ఉంది. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రెండు యూఎస్బీ, ఒక మైక్రో- యూఎస్బీ పోర్ట్ లతో వస్తుంది. బ్యాటరీ ఎంత ఉంది అనేది డిజిటల్ డిస్ ప్లేలో చూపిస్తుంది. 12 వాట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ధర రూ. 1000 ఉంటుంది.
బోట్ పీబీ 401
బోట్ పీబీ 401 పవర్ బ్యాంక్ 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. రెండు యూఎస్ బీ పోర్టులు, టైప్ సీ పోర్ట్ ఉంటాయి. ధర సుమారు రూ.1500 ఉంటుంది.
అర్బన్ నానో
అతి చిన్న సైజులో ఉండే ఈ వపర్ బ్యాంక్ 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. మల్టిపుల్ పోర్ట్స్ ఉంటాయి. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ధర రూ. 1500 ఉంటుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..