Pooja Hegde: లండన్ ఫ్యాషన్ వీక్‌లో పూజా హెగ్డే మెరుపులు.. మెరూన్ కలర్ గౌనులో గ్లోబల్ గ్లామర్

Pooja Hegde: లండన్ ఫ్యాషన్ వీక్‌లో పూజా హెగ్డే మెరుపులు.. మెరూన్ కలర్ గౌనులో గ్లోబల్ గ్లామర్


Pooja Hegde: లండన్ ఫ్యాషన్ వీక్‌లో పూజా హెగ్డే మెరుపులు.. మెరూన్ కలర్ గౌనులో గ్లోబల్ గ్లామర్

గ్లామర్, ఎలిగాన్స్ కలగలిసిన ఆ అద్భుత క్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆమె అడుగుపెడితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే. అల్లు అర్జున్ సరసన ‘బుట్టబొమ్మ’గా స్టెప్పులేసినా, ఎన్టీఆర్ పక్కన ‘అరవింద’గా హుందాతనాన్ని ప్రదర్శించినా ఆమెకే చెల్లింది. ముంబైలో పుట్టి, టాలీవుడ్‌ను ఏలి, ఇప్పుడు హాలీవుడ్ స్థాయి వేదికలపై తన సత్తా చాటుతోంది. తాజాగా లండన్ ఫ్యాషన్ వీక్ లో షో క్లోజింగ్ సెర్మనీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆ గ్లామర్ డాల్ మరెవరో కాదు.. పూజా హెగ్డే.

లండన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ ఖుషీ కుమార్ రూపొందించిన దుస్తులను ప్రదర్శించడానికి పూజా హెగ్డే షో టాపర్‌గా నిలిచింది. గాఢమైన మెరూన్ రంగులో ఉన్న లగ్జరీ హాల్టర్-నెక్ గౌను ధరించి రన్‌వేపై ఆమె నడిచి వస్తుంటే అందరి కళ్లు ఆమెపైనే నిలిచాయి. ఆ గౌను పైభాగంలో బంగారు వర్ణపు దారంతో ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల డిజైన్లు ఆమె లుక్‌కు రాజసాన్ని అద్దాయి. సాటిన్ ఫ్యాబ్రిక్ ఆమె శరీర సౌష్టవాన్ని ఎలివేట్ చేస్తూ ఎంతో హుందగా కనిపించింది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

తొలి అనుభవం..

తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పూజా ఈ అపురూప క్షణాలను పంచుకుంది. “లండన్ ఫ్యాషన్ వీక్‌లో షోను ముగించడం ఎంతో ఆనందంగా ఉంది. మొదటిసారి ఏదైనా చేయడం ఎప్పుడూ స్పెషలే. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రయాణాలు చేయాలని ఆశిస్తున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫ్రీగా వదిలేసిన వేవీ హెయిర్, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే నడకతో పూజా గ్లోబల్ స్టేజ్ పై భారతీయ గ్లామర్ సత్తా చాటింది.

2010 మిస్ యూనివర్స్ ఇండియాలో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన పూజా, ‘ముగామూడి’ అనే తమిళ సినిమాతో నటనలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’, ‘దువ్వాడ జగన్నాథమ్’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’ వంటి హిట్లతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ‘అల వైకుంఠపురములో’ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. బాలీవుడ్‌లో కూడా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో జతకట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతి నిండా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. 2026లో విజయ్ సరసన ‘జన నాయకన్’, వరుణ్ ధావన్ తో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *