
వైసీపీ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై వైసిపి నాయకుడు పేర్ని నాని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎన్.టి. రామారావు గారు 1989లో సుమారు 56-60 సీట్లు గెలిచినప్పటికీ, ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్లి.. మళ్లీ రాను అని చెప్పి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నారా చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదని, అయినప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. సభలో లేని జగన్మోహన్ రెడ్డి గురించి అసభ్యకరంగా మాట్లాడటం తప్పు అని చెప్పారు. మైకు ఇస్తే ప్రజా సమస్యలపై పోరాడతామని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని.. అలా ఇచ్చే పరిస్థితి లేదని.. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లడం లేదన్నారు.