Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు: పవన్ కళ్యాణ్


ఓజీ సినిమాకు సహకరించిన తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 25న సినిమా విడుదలకానుంది.  నేడు హైదరాబాద్ లో ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. తాజాగా పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను విడుదల చేశారు. “ఓజీ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణం. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. తెలంగాణ మంత్రివర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ జితేందర్ గారికి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి.ఆనంద్ గారికి, లాల్ బహదూర్ స్టేడియం నిర్వాహకులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

భారీ వర్షం కురుస్తున్నా ఈ వేడుకలో ఎనలేని ఉత్సాహంతో అసంఖ్యాకంగా అభిమానులు పాల్గొన్నారు. వారు చూపిస్తున్న అభిమానం, ఉత్సాహం మరువలేనిది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకున్న శ్రేయాస్ మీడియా సంస్థకు, బందోబస్తు చేపట్టిన పోలీసు సిబ్బందికీ ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్రానికి సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సహచరులకు, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా యాజమాన్యాలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, విలేకర్లకు కృతజ్ఞతలు. ‘ఓజీ’ చిత్ర రూపకల్పనలో ఎంతో తపించి పని చేసిన దర్శకుడు శ్రీ సుజిత్, నిర్మాతలు శ్రీ డి.వి.వి.దానయ్య, శ్రీ కళ్యాణ్ దాసరి, సంగీత దర్శకుడు శ్రీ తమన్, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను” అని పవన్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *