పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చేసింది. గత కొన్ని రోజులు క్రితం వరకూ ఎక్కడికి వెళ్ళినా ఓజీ… ఓజీ… ఓజీ ఈ పేరు వినిపించేది.. ప్రేక్షుకుల వేయింట్ ఫలించి ఓజీ మూవీ బుధవారం రాత్రినుంచే ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వేట మొదలు పెట్టింది. ఓజీ థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఓజీ సినిమాను వెండి తెరపై చూసేందుకు క్యూలు కడుతున్నారు. ప్రీమియర్ షోల్లో స్టార్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓజీకి సంబంధించిన వీడియోలలో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ ముద్దుల కూతురు ఆద్య తన అన్న అకిరీ తో కలిసి సినిమా చూస్తున్న వీడియోలు దర్శనం ఇచ్చాయి.
అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన OG సినిమా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నిపుతుంది. తమ అభిమాన హీరోని ఎలా చూడాలనుకున్నమో అదే విధంగా సుజిత్ చూపించాడని చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ నటన సినిమాకే హైలెట్ అని అంటున్నారు.
OGGGGGGGGGGGGGG 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/47Mr1vN8RN
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 24, 2025
సాయిదుర్గా తేజ్, అకీరా, ఆద్యలు థియేటర్స్‌లో సందడి చేసిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు హీరో నాని.. బ్లాక్‌బస్టర్ అని అంటూ చిత్ర యూనిట్ కి విశేష్ చెప్పారు. దర్శకుడు బాబీ కూడా సినిమాపై స్పందిస్తూ.. న్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌ను వెండి తెరపై చూశాను. పవర్‌స్టార్ ఒక అద్భుతం. సుజీత్, తమన్ల గురించి మాటల్లో చెప్పలేను. బ్లాక్‌బస్టర్ మూవీ అని తన సోషల్ మీడియా వేదికాగా పోస్ట్ చేశాడు..
#Aadhya papa & #AkiraNandan spotted at #OG premiers in Vimal cinemas ❤️🔥🔥@thechordfather #TheyCallHimOG #PawanKalyan pic.twitter.com/t3lAELohm5
— Lord Shiv🥛 (@lordshivom) September 24, 2025
ఓజీ సినిమా రిలీజ్ కి ముందుగానే టికెట్స్ అమ్మకాలతో కలెక్షన్ల వేట మొదలు పెట్టింది. రూ.60 కోట్లు వసూళ్లు సొంతమైనట్టు ట్రేడ్ వర్గాల టాక్. ఖుషి తర్వాత మళ్లీ అంత జోష్ ‘ఓజీ’ సినిమాకే కనిపించిందని పవన్‌కల్యాణ్ ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.యువ దర్శకుడు సుజీత్.. పవన్‌కల్యాణ్‌కి వీరాభిమాని..
ఓజీ మూవీ ముంబయి, జపాన్‌తో ముడిపడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కింది. పవన్‌కల్యాణ్ ఓజాస్ గంభీర పాత్రలో తెరపై సందడి చేయగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ప్రియాంక మోహన్ , ప్రకాశ్‌రాజ్, అర్జున్‌దాస్, శ్రియారెడ్డి, హరీశ్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..