జీర్ణ సమస్యలు: పనీర్ పాలతో తయారవుతుంది. చాలా మందికి తెలియనిది ఏంటంటే..లాక్టోస్ లేదా కేసిన్ జీర్ణం కావడంలో ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల రోజూ పనీర్ తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
నాణ్యత సమస్య: మనం ఇప్పుడు వాడే పాల నాణ్యత గతంలో లాగా లేదు. ఇందులో హార్మోన్లు, ఇతర రసాయనాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి పాలతో చేసిన పనీర్ తినడం వల్ల అవాంఛిత రసాయనాలు మన శరీరంలోకి చేరతాయి. రెస్టారెంట్లలో వాడే పనీర్ నాణ్యత కూడా అంతగా ఉండదు.
అనారోగ్య సమస్యలు: పనీర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం, జీర్ణక్రియపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మరింత హాని చేస్తుంది.
ఎలా తినాలి?: పోషకాహార నిపుణుల ప్రకారం.. పనీర్‌ను రోజూ కాకుండా అప్పుడప్పుడు తినడం మంచిది. అలా తిన్నప్పుడు కూడా పనీర్‌తో పాటు ఎక్కువగా కూరగాయలు చేర్చుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో తక్కువ కొవ్వు ఉన్న పాలతో పనీర్‌ను తయారు చేసుకోవాలి. పనీర్‌ను వేయించడం కాకుండా గ్రిల్ చేయడం, సలాడ్స్‌లో కలుపుకోవడం లేదా పచ్చిగా తినడం మంచిది.
అన్నిటికంటే ముఖ్యంగా పనీర్ మంచిదే అయినా.. మితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ఒక్క పనీర్పైనే ఆధారపడకుండా ఇతర ప్రోటీన్ ఆహారాలను కూడా తింటూ సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మొత్తంగా పనీర్ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ రోజూ కాకుండా అప్పుడప్పుడు, సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.