టీ20 ప్రపంచ కప్లో 10వ సూపర్ 8 మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య కాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగులు చేసింది. దీంతో లంక ముందు 213 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఈ ప్రపంచ కప్లో ఫర్హాన్ తన రెండవ సెంచరీని సాధించాడు. ఒకే టీ20 ప్రపంచ కప్లో రెండు సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మన్గా అతను నిలిచాడు. అతనికి ముందు, క్రిస్ గేల్ రెండు సెంచరీలు చేశాడు. కానీ రెండూ రెండు వేర్వేరు ఎడిషన్లలో వచ్చాయి.
కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (0), మహ్మద్ నవాజ్ (0), షాదాబ్ ఖాన్ (7), మహ్మద్ నఫే (2) ఔటయ్యారు. ఫఖర్ జమాన్ (84) దుష్మంత చమీరా బౌలింగ్ లో ఔటయ్యాడు.
పాక్ జట్టు సెమీస్ చేరాలంటే శ్రీలంక జట్టును కేవలం 147 పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ శ్రీలంక 148 పరుగులకు పైన చేస్తే న్యూజిలాండ్ జట్టు సెమీస్ చేరుకుంటుంది.