
PAK vs ENG : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో ఇంగ్లండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. పాకిస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఒకానొక దశలో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ ధాటికి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడినా, బ్రూక్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.