Headlines

Vizag Zoo: పిల్లలకు ఇక పండగే.. విశాఖ జూలోకి అరుదైన కొత్త అతిథులు!

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఇప్పటికే అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు, అరుదైన జంతువులకు నిలయంగా ఉన్న విశాఖ జూకు తాజాగా మరికొన్ని అరుదైన అతిథులు వచ్చి చేరాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో చేపట్టిన జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా మొత్తం 12 వన్యప్రాణులను విశాఖ జూకు తీసుకొచ్చారు. ఇందులో మూడు జీబ్రాలు, నాలుగు కాటన్-టాప్ టామరిన్లు, మూడు రెడ్-నెక్డ్ వాలబీలు, రెండు కామన్ మార్మోసెట్లు…

Read Full News

Personal Loan: మీకు ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం..?

Personal Loan: అందరూ డబ్బు ఆదా చేయలేరు. అదే సమయంలో ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే, వ్యక్తిగత రుణం ఒక్కటే మార్గం. అయితే, మీరు అడిగినంత మాత్రాన బ్యాంకులు రుణాలు ఇవ్వవు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికి వివిధ షరతులను కలిగి ఉంటాయి. అవి చాలా విషయాలను తనిఖీ చేస్తాయి. వ్యక్తిగత రుణం పొందడానికి మీరు ఎంత డబ్బు సంపాదించాలి? ఈ నియమం గురించి చాలా…

Read Full News

Andhra News: గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో అడ్డంగా బుక్కయ్యారు..

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. యెర్నగూడెం సమీపంలో ఎన్‌హెచ్-16 వద్ద అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 21 కిలోల గంజాయితో పాటు రెండు బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కనున్న పాత బ్రాందీ షాపు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయి…

Read Full News

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీలో నం.1 ఇషాన్ కిషన్, నం.3 వైభవ్ సూర్యవంశీ.. టాప్ 5 ప్లేయర్లు వీళ్లే

Duleep Trophy 2026: చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో సత్తా చాటారు. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడుతూనే, సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మ్యాచ్ సమయంలో 160కి పైగా పరుగులు చేసి క్రీజులో నిలిచిన ఆయన, డబుల్ సెంచరీ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో 200 పరుగుల…

Read Full News

300 ఏళ్ల తర్వాత రామప్పలో తెరుచుకున్న సోమసూత్రం.. ఎలా తెరిచారో తెలుసా..!

వరంగల్‌, సెప్టెంబర్ 7: తెలుగు రాష్ట్రాలలో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక చారిత్రక నిర్మాణం రామప్ప దేవాలయం. ఈ ఆలయాన్ని కాకతీయుల పరిపాలన సమయంలో క్రీ.శ.1213లో ప్రారంభించి 40 సంవత్సరాల పాటు అబ్బురపరిచే శిల్పాలతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని పరిపాలనా సమయంలో ఆయన సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ చారిత్రక ఆలయాన్ని నిర్మించారు. భారతదేశంలో ఒక శిల్పిపేరిట పిలువబడే ఏకైక ఆలయంగా రామప్పకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది…..

Read Full News

OTT Movie: ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ప్రస్తుతం మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే ఈ మాలీవుడ్ సినిమాలను ఎగబడి చూస్తున్నారు ఆడియెన్స్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా ప్రతివారం రెండు, మూడు మలయాళం సినిమాలను తెలుగులోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక మలయాళం మూవీనే. అందులోనూ ప్రజెంట్ ట్రెండ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు చెందిన మూవీ….

Read Full News

Kaaka Movie: మెగాస్టార్ కూతురిగా మలయాళీ క్రేజీ హీరోయిన్.. కాకా నుంచి సర్ ప్రైజింగ్ పోస్టర్ అదిరిపోయింది..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర.. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కాకా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కాకా మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ మూవీ నుంచి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇటీవలే మన శంకరవరప్రసాద్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక…

Read Full News

Gopichand: ఆ సినిమా తర్వాత నీ రేంజ్ ఎక్కడో ఉంటుందని అన్నారు.. : గోపీచంద్

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు గోపీచంద్. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు గోపీచంద్. తన నట ప్రస్థానంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో, ఆయన తన కెరీర్‌లోని మైలురాళ్లను, కొన్ని ప్రత్యేకమైన అనుభవాలను పంచుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా అత్యంత ఇష్టపడే చిత్రాలలో జయం మొదటి స్థానంలో నిలుస్తుందని, ఆ తర్వాత యజ్ఞం,…

Read Full News

Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఘాటుగా స్పందించిన పవన్ హీరోయిన్

Hardik Pandya: క్రికెట్ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే హార్దిక్ పాండ్యా చుట్టూ కొత్త వివాదం చేరింది. ఇటీవల ఒక స్టార్ హోటల్‌లో జరిగిన విందులో బాలీవుడ్ నటి అమీషా పటేల్ పాల్గొంది. ఆ సమయంలో తన స్నేహితులకు హార్దిక్ పాండ్యాను పరిచయం చేస్తూ నటి అతడి భుజంపై సాధారణంగా చేయి వేసింది. ఈ సన్నివేశాన్ని ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ “రెడ్డిట్‌లో వస్తున్న రూమర్లు నిజమే కాబోలు, వీరిద్దరి…

Read Full News

Money Scam: గణేశ్ నవరాత్రుల వేళ సైబర్ మోసాల వల.. దేవుడ్నీ వదలని దొంగనా కేటుగాళ్లు!

గణేశ్ నవరాత్రుల సందడి మొదలయ్యే వేళ సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాలకు పదును పెడుతున్నారు. వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, మండపాల అలంకరణ వస్తువులు, లడ్డూ ప్రసాదం, ఆన్‌లైన్ విరాళాల పేరుతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదారు రెట్లు తక్కువకే వస్తువులను హోం డెలివరీ చేస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు పెడుతున్నారు. వీటిని నమ్మి సంప్రదించిన పలువురు ఇప్పటికే నగదు కోల్పోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్‌లైన్ సెర్చ్‌లోనే నకిలీ…

Read Full News