కన్న తండ్రి ఆరాటం.. కొడుకు బతికే ఉంటాడన్న ఆశతో.. నేపాల్ వరదల్లో కన్నీటి గాథ !
ఆకస్మిక వరదల విషాదానికి దాదాపు వారం కావస్తుంది. నేపాల్ వరదల బీభత్సంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. గల్లంతయిన దాదాపు 3 వేల మంది ఆచూకీ దొరకలేదు.. తన కొడుకు వినోద్ కోసం తల్కా సదా వెతికీ వెతికీ అలసిపోయాడు. ఒంట్లో శక్తి లేదు, నిలబడే ఓపిక కూడా లేదు. అయినా కన్న కొడుకు కోసం ఆ తండ్రి వెతుకులాట వారం రోజులుగా సాగుతూనే ఉంది. కొడుకు ఆచూకీ కోసం నేపాల్ కొండల మధ్య ఎన్నో మైళ్ళు…