Headlines

క్యాన్సర్‌కు రామబాణం క్యాప్సికమ్‌! పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే…

క్యాన్సర్ నివారణలో క్యాప్సికమ్ పాత్ర: ఎరుపు, పసుపు రంగు క్యాప్సికమ్‌లలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. ఎరుపు క్యాప్సికమ్‌లో లైకోపీన్ అనే కాంపౌండ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు క్యాప్సికమ్‌లో లూటీన్, జెగ్జాంతిన్, బీటా-కరోటిన్ వంటి కెరోటినాయిడ్లు ఎక్కువ. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి, హానికర కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే ఎర్రటి క్యాప్సికమ్ రోజువారీ అవసరానికి కావలసిన దానికంటే మూడు రెట్లు…

Read Full News

ఫ్లోరిడా సముద్రంలో షార్క్ దాడి.. స్నేహితుడిని కాపాడిన “రియల్ హీరో”!

కానీ, బోటు పక్కన చూసేసరికి అక్కడ నీరు ఎరుపు రంగులోకి మారడం చూసి జాకబ్ జాన్సన్ షాకయ్యారు. ఆ పక్కనే భారీ షార్క్ నీటిలో తచ్చాడుతూ కనిపించింది. మణికట్టు దగ్గర తీవ్రంగా గాయపడి, రక్తస్రావం కావడంతో నీటిలో కొట్టుమిట్టాడుతూ ఆ వ్యక్తి కనిపించాడు. తీవ్ర గాయం కారణంగా అతడు స్వయంగా బోట్ ఎక్కలేని స్థితిలో ఉన్నాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని కూడా లెక్కచేయకుండా కెప్టెన్ జాకబ్  జాన్సన్ వెంటనే సముద్రంలోకి దూకారు. క్షణాల వ్యవధిలో…

Read Full News

Tollywood : 14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. 500లకు పైగా సినిమాలు.. రెండు పెళ్లిళ్లు.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..

సహజమైన నటనకు పెట్టింది పేరు, దక్షిణాది సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న అగ్ర నటి జయంతి. ఆవిడ నటనలో కృత్రిమత్వం కనిపించదు. నృత్యం ఆవిడకున్న బలం. 1945 జనవరి 6న సంయుక్త మద్రాస్ రాష్ట్రంలోని బళ్ళారిలో కమలకుమారిగా జన్మించారు. ఆమె తండ్రి సుబ్రమణ్యం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో లెక్చరర్. తల్లి సంతానలక్ష్మి. కమలకుమారి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో, సంతానలక్ష్మి పిల్లలను తీసుకొని మద్రాస్ చేరుకున్నారు. అప్పటికి కమలకుమారికి 12 ఏళ్లు. డ్యాన్స్ పట్ల…

Read Full News

కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్‌వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!

అన్నమయ్య జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. కురబలకోట మండలం అంగళ్లు అవుట్‌పోస్ట్ వద్ద పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 29 ఏళ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది….

Read Full News

Video: ఒక్కసారిగా గుప్పుమన్న గంజాయి వాసన.. మ్యాచ్ ఆపేసిన సబలెంకా..!

Aryna Sabalenka: యూఎస్‌ ఓపెన్‌ 2026లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆర్యనా సబలెంకాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో మూడో రౌండ్‌లో తలపడుతున్న సమయంలో కోర్టు పరిసరాల నుంచి గంజాయి వాసన వస్తోందంటూ సబలెంకా అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. సబలెంకా 3–0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. సర్వీస్ చేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు వాసన బలంగా వస్తోందని చెప్పడంతో మ్యాచ్‌ కాసేపు నిలిచింది. అనంతరం ఆట తిరిగి కొనసాగింది. ఈ ఘటన జరిగినప్పటికీ…

Read Full News

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో మళ్లీ ట్రోఫీ రచ్చ తప్పదా?.. నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్

Asia Cup 2026: 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిసి దాదాపు ఏడాది కావోస్తున్నా నాటి విజయవంతమైన ట్రోఫీ ఇప్పటివరకు టీమిండియా చేతికి దక్కలేదు. నాడు ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా బహుమతి తీసుకోవడానికి భారత జట్టు సున్నితంగా నిరాకరించింది. ఆ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నఖ్వీ, ట్రోఫీని నేరుగా వేదిక నుంచి…

Read Full News

అమెరికాలో భయం నీడన వినాయక చవితి..ఇళ్లలోనే జరుపుకోవాలని మెసేజ్ లు!

అపార్ట్‌మెంట్లు, కాలనీలు లేదా బహిరంగ ప్రదేశాలలో ఎవరూ సామూహికంగా వేడుకలు జరుపుకోవద్దని ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేడుకలకు ఆహ్వానిస్తే,  ఇంట్లోనే పండుగ చేసుకుంటామని వారికి సున్నితంగా చెప్పాలని కోరారు. అలాగే కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో అస్సలు పోస్ట్ చేయవద్దనీ,  రోడ్డు పక్కన చేసే సెలబ్రేషన్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదనీ,  రోడ్లపై భారీగా మండపాలు ఏర్పాటు చేయడం,…

Read Full News

Kobbari Pulihora: ఈ కొబ్బరి పులిహోర తిన్నవాళ్లు రెసిపీ అడగకుండా ఉండలేరు! ప్రసాదాలు, లంచ్‌బాక్స్‌కు సూపర్!

పచ్చి కొబ్బరి తియ్యదనం, పచ్చిమిర్చి కారం, నిమ్మరసం లేదా మామిడికాయ తురుము పులుపుదనానికి ఆవాలు, కొత్తిమీర సువాసనలు తోడైతే ఈ పులిహోర ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. లంచ్ బాక్స్‌లకు సైతం చల్లారిన తర్వాత కూడా కమ్మగా ఉండే ఈ అద్భుతమైన కొబ్బరి పులిహోర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: పావు కిలో – ఒక గ్లాసు బియ్యం, అర చెక్క తాజా పచ్చి కొబ్బరి ముక్కలు, 5 నుండి 6 పచ్చిమిర్చి,  గుప్పెడు కొత్తిమీర, రెండు రెమ్మల…

Read Full News

చిన్న సినిమాలే.. కానీ థియేటర్స్ అన్నీ హౌజ్ ఫుల్..

మామూలుగా పెద్ద స్టార్ సినిమాలు లేదా పండగ సీజన్ లేనిదే థియేటర్లు ఫుల్ అవ్వడం కష్టం. కానీ ప్రస్తుతం పెద్ద స్టార్స్ లేకపోయినా, పండగ సీజన్ కాకపోయినా థియేటర్లు హౌజ్ ఫుల్ అవుతూ ప్రేక్షకులతో సందడిగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగిస్తూ, రాబోయే రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు కొత్త చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, ఇవి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీకి తెర తీయనున్నాయి.సెప్టెంబర్ 10న కార్తీ నటించిన “సర్దార్ 2” అన్నపూర్ణ స్టూడియోస్…

Read Full News

వినాయక చవితి స్పెషల్.. గణపతి బాప్పాకు ఇష్టమైన నైవేద్యాలేంటో తెలుసా?

వినాయక చవితి అంటే భక్తి, ఉత్సాహం, సందడి మాత్రమే కాదు.. సంప్రదాయ వంటకాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గణేశుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటకం ప్రత్యేకంగా ఉన్నప్పటికీ.. మోదక్, ఉండ్రాళ్లు, కజ్జికాయలు, పాయసం, పులిహోర వంటి సంప్రదాయ వంటకాలు పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తుమ్మి ఆకు ఎందుకు ప్రత్యేకం? వినాయక చవితి సందర్భంగా గణేశుడికి 21 రకాల…

Read Full News