Headlines

నటుడు అవ్వాలనుకున్నా.. కానీ గేయ రచయిత అయ్యా.! కారణం చెప్పిన కాసర్ల శ్యామ్

ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రస్థానాన్ని వివరిస్తూ ఒక ఎమోషనల్ విషయాన్నీ పంచుకున్నారు. “మహాత్మ” చిత్రంలో శాస్త్రి గారు రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు గాంధీ” పాటలో నటించడం ద్వారా తన సినీ రంగ ప్రవేశం జరిగిందని, ఆ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో బోనాల సాంగ్ మధ్యలో వచ్చే రెండరింగ్ కూడా తానే పాడి, నటించానని తెలిపారు. అప్పుడు పొడవాటి జుట్టుతో ఉన్నానని, అది ఒక…

Read Full News

ఈ పక్షి హంటింగ్ ట్రిక్ తెలిస్తే మీరు స్టన్ అవుతారు..

ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన వేట వ్యూహం ఉంటుంది. అయితే బ్లాక్ హెరాన్ పక్షి అనుసరించే వేట పద్ధతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చేపలను పట్టుకునేందుకు ఈ పక్షి తన రెక్కలనే గొడుగులా ఉపయోగిస్తుంది. అందుకే దీనిని చాలాసార్లు ‘అంబ్రెల్లా బర్డ్’ అని కూడా పిలుస్తారు. రెక్కలే గొడుగుగా.. బ్లాక్ హెరాన్ సాధారణంగా నిస్సారమైన నీటిలో చేపల కోసం వేటాడుతుంది. చేప కనిపించినప్పుడు నేరుగా దూకకుండా.. ముందుగా తన రెక్కలను శరీరం చుట్టూ, తలపైకి విస్తరించి ఒక…

Read Full News

మంటల్లో చిక్కుకున్న లారీ.. 200 మేకలు, డ్రైవర్‌ సజీవ దహనం! ఎక్కడంటే..

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలను తరలిస్తున్న డీసీఎం వాహనం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్‌తో పాటు సుమారు 200 మేకలు సజీవ దహనమయ్యాయి. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో.. అధికారుల వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జాతీయ రహదారి-44పై భూత్పూర్‌ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 150 నుంచి 200 మేకలను…

Read Full News

Venus Transit: ఈ రాశులపై శుక్రుడి సిరిసంపదల వర్షం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహం ప్రస్తుతం తన స్వస్థానమైన తులా రాశిలో జనవరి 2 వరకు సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశిలో శుక్రుడికి బాగా బలం పెరిగి స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. అయితే, భోగభాగ్యాలను ఇవ్వడంలో సాధారణంగా శుక్రుడు తనకు అనుకూలమైన, ఇష్టమైన రాశులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడికి బాగా ఇష్టమైన రాశులుః వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభం. తులా రాశి నుంచి వృశ్చిక…

Read Full News

Hyderabad: 48 గంటల్లో హత్య కేసును చేధించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు.. ఎలా అంటే?

రంగా రెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస నేరాల గుట్టును పోలీసులు మట్టుబెట్టారు. అలీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య కేసుతో పాటు, కాటేదాన్‌లోని హర్ష్ బేకర్స్ లో జరిగిన భారీ నగదు చోరీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రెండు వేర్వేరు కేసుల్లో కీలక పురోగతి సాధించిన పోలీసులు, ప్రధాన నిందితులతో పాటు వారి సహచరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసులకు…

Read Full News

ఈ పండ్లు రోజుకు 10 తింటే చాలు, రుచికి రుచి.. ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు!

వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: రాస్ప్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షించడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గింపునకు: ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రాస్ప్‌బెర్రీస్…

Read Full News

Love Astrology: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. వీరి ప్రేమ జీవితంలో కలతలు..జాగ్రత్త?

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, ఆకర్షణ, అందం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు కారక గ్రహంగా భావిస్తారు. శుక్రుడి సంచారంలో మార్పులు వచ్చినప్పుడు వ్యక్తిగత జీవితంతో పాటు ప్రేమ, వివాహం, ఆర్థిక అంశాలపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నమ్మకం. సెప్టెంబర్ 11న రాహువు అధిపత్యంలోని స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించనున్నారు. అక్టోబర్ 24 వరకు ఆ నక్షత్రంలోనే కొనసాగుతారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు సంబంధాలు, డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు…

Read Full News

హైదరాబాద్‌ DRDOలో రీసెర్చ్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షల్లో జీతం

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌ (RCI).. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతలపై పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మిసైల్‌ కాంప్లెక్స్‌లో భాగమైన RCIలో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) తాత్కాలిక పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది…..

Read Full News

దుబాయ్‌లో సింగిల్‌ రూమ్‌ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

దుబాయ్ అంటేనే విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు, భారీ జీతాలు గుర్తొస్తాయి. కానీ అక్కడ జీవితం అందరికీ అంత అందంగా ఉండదు. ముఖ్యంగా తక్కువ, మధ్యతరగతి ప్రవాసులు అద్దెలు భరించలేక పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ భారతీయ మహిళ దుబాయ్‌లో తాను నెలకు ముప్పై వేలు చెల్లించి ఉంటున్న అతి చిన్న గదిని సోషల్ మీడియాలో చూపించగా, అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.30 వేలకు దుబాయ్‌లో మీకు ఏం దొరుకుతుంది?…

Read Full News

విజయవాడలో మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాకే..!

మద్యం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయం వెతుక్కోవడం సాధారణమే. కానీ, ఇప్పుడు కొందరు ఏకంగా చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లనే మద్యం మాదిరిగా వినియోగిస్తున్నట్లు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో ఇథనాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల దుర్వినియోగంపై తనిఖీలు చేపట్టగా.. భారీ స్థాయిలో వాటి విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌ సమయంలో సులభంగా లభించేలా ఇచ్చిన లైసెన్స్‌ మినహాయింపే ఇప్పుడు దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తోందన్న అభిప్రాయంతో రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కేంద్రానికి లేఖ రాసింది. మద్యం బదులు…

Read Full News