Headlines

కష్టపడి దాచుకున్న రూ.19 లక్షలు ఇవ్వలేదని.. సహకార సంఘం ముందు మంచం వేసుకున్న వృద్ధ రైతు!

పొలాల్లో దిగి పనిచేసే శారీరక సత్తువ తమకు ఇప్పుడు లేదని, వృద్ధాప్యంలో మందుల ఖర్చులు, నిత్య జీవనానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశంతోనే పైసా పైసా కూడబెట్టి సొసైటీలో డిపాజిట్ చేశామని నర్సింహమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి కన్నీటిపర్యంతమయ్యారు. తీరా అవసరమైన సమయంలో అసలు సొమ్ము ఇవ్వకపోగా, కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు వాపోయారు. Source link

Read Full News

ప్రీమియం లుక్‌ స్మార్ట్‌వాచ్‌ కొనాలనుకుంటే బోట్‌ వేవ్‌ ఫ్యూరీ గురించి తెలుసుకోండి.. లేదంటే ఫీలవుతారు

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్‌ను ఇస్తూ ఫిట్‌నెస్‌ను అత్యంత కచ్చితంగా పర్యవేక్షించే అద్భుతమైన గాడ్జెట్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ బోట్ నూతన మోడల్‌ వాచ్​ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన మెటాలిక్ గ్రే స్ట్రాప్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ప్రత్యేకతలు ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ మెటాలిక్…

Read Full News

చూడ్డానికి అందంగా ఉంది కదూ.. వేడి నీటిలో వేయగానే రంగుమారే ఈ పువ్వు ప్రయోజనాలు తెలిస్తే..

అలాగే ఈ పువ్వులో ఉండే పోషకాలు మన చర్మం, జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, తేమను కాపాడటానికి, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు ఈ పువ్వులతో తయారు చేసిన హెర్బల్ టీని తాగడం వల్ల వాటిని దూరం చేసుకోవచ్చు. Source link

Read Full News

Allari Naresh: ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.. అందుకే ఆ సినిమాను ఇప్పటివరకు మళ్లీ చూడలేదు.. అల్లరి నరేష్ ఎమోషనల్..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కామెడీ చిత్రాలతో నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అత్యంత వ్యక్తిగత, భావోద్వేగ క్షణాలను వెల్లడించారు. చిన్ననాటి ప్రమాదం నుండి తండ్రి ఈవీవీ సత్యనారాయణ మరణం వరకు ఆయన పడిన కష్టాలు, ప్రొఫెషనల్ బాధ్యతలు, వ్యక్తిగత బాధల మధ్య ఆయన ఎలా సమన్వయం చేసుకున్నారన్నది అందరిని కట్టిపడేస్తుంది. నరేష్…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ముక్కు మీదే కోపం..! చిన్న విషయాలకే భగ్గుమంటారు!

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మనం జన్మించిన తేదీ (మూలాంకం) మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తుల్లో కోసం, ఆవేశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మరికొందరికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కొందరు చాలా త్వరగా కోపానికి లోనవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. 1. మూలాంకం 1 (తేదీలు: 1, 10, 19, 28) సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో…

Read Full News

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న సీక్రెట్‌ తెలిస్తే..

మన ఇళ్లలో, పరిసరాల్లో ఎలుకలు తిరగడం సర్వసాధారణం. అయితే ఎలుకను చూడగానే మనకు ప్రత్యేకంగా కనిపించేది దాని పొడవైన తోక. చాలామంది ఆ తోక కేవలం ఒక శరీర భాగం మాత్రమే అనుకుంటారు. కానీ, ఎలుక జీవితంలో, మనుగడలో అది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీవశాస్త్ర పరంగా ఎలుక తోక వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఇవే: శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: ఎలుకల శరీరం మొత్తం వెంట్రుకలతో నిండి ఉన్నప్పటికీ, వాటి తోకపై మాత్రం వెంట్రుకలు…

Read Full News

36,000 అడుగుల ఎత్తులో ఇంజిన్ షట్‌డౌన్! ఉపిరి బిగపట్టిన ప్రయాణికులు.. చివరకు..!

మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఉండగా ఇంజన్‌లో సమస్యలు రావడంతో విమానం తిరిగి కొచ్చికి రావాల్సి వచ్చింది. కొచ్చి నుంచి అబుదాబికి వెళ్తున్న IX 415 విమానం టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత సమస్య తలెత్తింది. విమానం 36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్లు ఇంజిన్-1లో ఆయిల్ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు ఫైలట్లు గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసిన సిబ్బంది అబుదాబి…

Read Full News

మిస్ వరల్డ్ 2026 కిరీటం దక్కించుకున్న జోహెరీ మోలా! ఈమెది ఏ దేశమంటే?

మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా డొమింగెజ్ సొంతం చేసుకున్నారు. 73వ మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తానుసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విజేతగా నిలిచిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా జోహెరీకి కిరీటధారణ జరిగింది. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’తో ఆకట్టుకున్న జోహెరీ…

Read Full News

Garuda Purana: మరణం తర్వాత ఇంట్లో పొయ్యి ఎందుకు వెలిగించరు? గరుడ పురాణం ఏం చెబుతోంది?

Garuda Purana Beliefs Telugu: గరుడ పురాణం హిందూ మతంలోని ముఖ్యమైన పురాణ గ్రంథాలలో ఒకటిగా భావిస్తారు. శ్రీమహావిష్ణువు, ఆయన వాహనమైన గరుడుని మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ గ్రంథం సాగుతుంది. ఇందులో జీవితం, మరణం, కర్మ, పాపపుణ్యాలు, స్వర్గం, నరకం, మరణానంతర ఆత్మ ప్రయాణం, మోక్షం వంటి అంశాలను వివరించినట్లు చెబుతారు. మరణం తర్వాత గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మృతుని ఆత్మకు శాంతి కలుగుతుందని హిందూ సంప్రదాయంలో నమ్మకం ఉంది. మరణం తర్వాత…

Read Full News

High Cholesterol: కొలెస్ట్రాల్ పెరిగిందా? శరీరం ఇచ్చే ఈ సంకేతాలను అస్సలు లైట్ తీసుకోకండి!

కొన్ని సందర్భాల్లో రక్తప్రసరణ తగ్గడం లేదా కొలెస్ట్రాల్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా శరీరంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, ఛాతీలో అసౌకర్యం, అకస్మాత్తుగా తల తిరగడం లేదా చర్మంపై కొన్ని పసుపు రంగు కొవ్వు నిల్వలు వంటి లక్షణాలను గమనించవచ్చు. అయితే వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని నిర్ధారించలేం. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు అవసరం. 1. నడిచినప్పుడు కాళ్లలో…

Read Full News